News June 5, 2024
ప్రధాని మోదీకి శుభాకాంక్షలు: US, రష్యా అధ్యక్షులు

లోక్‌సభ ఎన్నికల్లో NDA విజయం సాధించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి US అధ్యక్షుడు జో బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ‘PM మోదీ, NDA నేతలకు అభినందనలు. మన దేశాల మధ్య స్నేహం అంతకంతకూ పెరుగుతోంది’ అని ట్వీట్ చేశారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రధాని మోదీకి విషెస్ తెలియజేశారు.
Similar News
News January 23, 2026
Plz.. ఆ రీల్‌కు పిల్లల్ని దూరంగా ఉంచండి: అనిల్ రావిపూడి

తన డైరెక్షన్‌లోని లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ పాపులర్ డైలాగ్స్‌లో ‘మద్యపానం మహదానందం’ ఒకటని డైరెక్టర్ అనిల్ రావిపూడి అన్నారు. ఇన్‌స్టాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోందని, ఇన్‌స్టాలో వెరైటీగా రీల్స్ వస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అయితే పిల్లలకు మాత్రం దీన్ని చూపించొద్దని, వారిచే దానిపై రీల్ చేయించొద్దని కోరారు.
News January 23, 2026
Paytm షేర్ విలువ 10% డౌన్.. కారణమిదే

Paytm మాతృసంస్థ ‘వన్97 కమ్యూనికేషన్స్’ షేర్లు ఒక్కరోజే 10% పడిపోయి ₹1,134కు చేరుకున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్’ (PIDF) పథకం 2025 డిసెంబర్ తర్వాత కొనసాగుతుందో లేదో అన్న ఆందోళనే ఇందుకు కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. Paytm లాభాల్లో ఈ పథకం ద్వారా వచ్చే ప్రోత్సాహకాలే 20% వరకు ఉంటాయని అంచనా. దీనిపై RBI నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.
News January 23, 2026
ప్రభుత్వ బడుల్లో కేంబ్రిడ్జి పాఠాలు!

AP: ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యమైన విద్య అందించేలా కేంబ్రిడ్జి వర్సిటీ(UK)తో GOVT ఒప్పందం చేసుకోనుంది. దీనిద్వారా జాయింట్ రీసెర్చ్, కరిక్యులమ్ రూపొందిస్తారు. 8-10 తరగతుల్లో కేంబ్రిడ్జి సర్టిఫైడ్ ఆన్లైన్ కోర్సులు, ఫ్యాకల్టీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం ప్రవేశపెడతారు. AU, IIT తిరుపతి సహా ఇంజినీరింగ్ కాలేజీల్లో వర్సిటీ భాగస్వామ్య కోర్సులు నిర్వహిస్తారు. ఈమేరకు దావోస్‌లో మంత్రి లోకేశ్ వర్సిటీ VCతో చర్చించారు.


