News August 26, 2024

వెల్ఫేర్ హాస్టల్‌లో ఫిర్యాదుల పెట్టె

image

TG: కలుషిత నీరు, ఆహారం, అపరిశుభ్ర పరిసరాలు వంటి కారణాలతో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులు నిత్యం అనారోగ్యానికి గురవుతుంటారు. దీంతో SC, ST, BC, మైనార్టీ హాస్టళ్లు, KGBVల్లో వరంగల్ కలెక్టర్ సత్యశారద ఫిర్యాదుల పెట్టెలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తమ సమస్యలను చీటీపై రాసి అందులో వేయాలి. తనిఖీలు, సందర్శనల సందర్భాల్లో కలెక్టర్ స్వయంగా పెట్టె తెరిచి చీటీలు పరిశీలిస్తారు. తాళాలూ కలెక్టర్ వద్దే ఉంటాయి.

Similar News

News December 2, 2025

విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

image

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

News December 2, 2025

PCOS ఉంటే వీటికి దూరంగా ఉండాలి

image

PCOS ఉన్నవారు బెల్లం, పంచదార, తేనె, తీపి, మైదా, బేకరీ ఆహార పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. 1.5 శాతం మాత్రమే కొవ్వు ఉండే పాలు, పెరుగు తీసుకోవాలి. వంటల్లో నూనె తక్కువ ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఇవన్నీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల PCOS, ఇన్సులిన్‌ స్థాయులు అదుపులోకి వస్తాయి. దీంతో గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

News December 2, 2025

ఇవాళ ఢిల్లీకి రేవంత్

image

TG: సీఎం రేవంత్‌ ఇవాళ రాత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు ప్రధాని మోదీతో సమావేశమై రాష్ట్రంలో ఈ నెల 8, 9న జరిగే గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానించనున్నారు. దీంతో పాటు పలువురు కేంద్రమంత్రులు, AICC నేతలను ఆయన ఇన్వైట్ చేయనున్నారు. మరోవైపు ఇవాళ మధ్యాహ్నం ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా ఉమ్మడి ఖమ్మంలోని కొత్తగూడెంలో జరిగే కార్యక్రమంలో CM పాల్గొంటారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు.