News March 21, 2024
గృహ జ్యోతి పథకం.. వారి కోసం ప్రత్యేక కౌంటర్లు

TG: గృహాజ్యోతి పథకానికి అర్హులై ఉండి, జీరో బిల్లు రాని వారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఎంపీడీవో, మున్సిపల్, జీహెచ్‌ఎంసీ సర్కిల్ ఆఫీసుల్లో ఈ స్పెషల్ కౌంటర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారు తమ వివరాలను సరిచేసుకోవాలని సూచించింది. ఈ పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ అందిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News April 14, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్

AP: వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం ఈ చట్టం రూపొందించిందని పిటిషన్‌లో పేర్కొంది. పార్లమెంట్‌లో కూడా ఆ పార్టీ బిల్లును వ్యతిరేకించింది.. కాగా మైనార్టీ సమాజానికి వైసీపీ అండగా ఉంటుందని జగన్ ఇటీవల హామీ ఇచ్చారు.
News April 14, 2025
DCvsMI: అక్షర్ పటేల్‌కు రూ.12 లక్షల ఫైన్

IPL: ముంబై చేతిలో ఓటమితో బాధలో ఉన్న ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా BCCI రూ.12 లక్షల ఫైన్ విధించింది. ఈ సీజన్‌లో జరిమానా పడిన ఆరో కెప్టెన్‌గా నిలిచారు. ఈ జాబితాలో పరాగ్, శాంసన్(RR), పాండ్య(MI), పంత్(LSG), పాటీదార్(RCB) ఉన్నారు. కాగా 3సార్లు స్లో ఓవర్ రేట్ మెయింటేన్ చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ బ్యాన్ విధించే నిబంధనను బీసీసీఐ తొలగించిన విషయం తెలిసిందే.
News April 14, 2025
మెహుల్ ఛోక్సీ అప్పగింతకు భారత్ లేఖ

PNBకి రూ.13వేల కోట్లు ఎగ్గొట్టి పారిపోయిన మెహుల్ ఛోక్సీని బెల్జియం అధికారులు <<16091808>>అరెస్ట్<<>> చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడిని తమకు అప్పగించాలని భారత్ లేఖ రాసిందని అక్కడి ప్రభుత్వం నిర్ధారించింది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం ఛోక్సీపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. కాగా గతంలో అతడి కోసం జారీ చేసిన ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు డిలీట్ కాగా ఈడీ, సీబీఐ మాత్రం వేట ఆపలేదు.