News April 7, 2025
చెప్పులు దాస్తే ₹5వేలే ఇచ్చాడని వరుడిపై కర్రలతో దాడి..

కొన్ని ప్రాంతాల్లో వివాహాల్లో వరుడి చెప్పులను దాచి కట్నం తీసుకోవడం ఆచారం. UP బిజ్నోర్లో ఓ వరుడిని ₹50వేలు డిమాండ్ చేశారు. అతడు ₹5వేలు ఇవ్వడంతో గొడవ జరిగింది. తక్కువ డబ్బు ఇచ్చినందుకు వధువు వైపు మహిళలు వరుడిని ‘బిచ్చగాడు’ అని తిట్టడంతో ఇరు కుటుంబాలు దాడి చేసుకున్నాయి. దీంతో వధువు కుటుంబం (బావమరుదులు) వరుడిని రూమ్లో బంధించి కర్రలతో కొట్టింది. పోలీసుల జోక్యంతో ఇరు కుటుంబాల మధ్య రాజీ కుదిరింది.
Similar News
News April 11, 2025
పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం

TGలో ప్రస్తుతం ఫింగర్ ప్రింట్ ద్వారా పెన్షన్లు అందజేస్తుండగా ఇకపై ఫేషియల్ రికగ్నిషన్ విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనుంది. ఇందుకోసం సెర్ప్ ప్రత్యేక యాప్ను రూపొందిస్తోంది. మే/జూన్ నుంచి దీనిని ప్రారంభించనుంది. వృద్ధులకు వేలిముద్రలు పడక ఇబ్బందులు ఎదురవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ కేటగిరీల్లో రాష్ట్రంలో 42.96L మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. దివ్యాంగులకు నెలకు ₹4,016, ఇతరులకు ₹2,016 అందుతోంది.
News April 11, 2025
మార్కెట్లో కనిపించని మామిడి సందడి

TG: ఏప్రిల్ రెండో వారం పూర్తవుతున్నా మర్కెట్లో అంతగా మామిడి పండ్లు కనిపించడం లేదు. సహజంగా మార్చి నుంచే మామిడిపండ్లతో నిండే మార్కెట్లలో ఇప్పుడు అంతగా సరఫరా లేదు. గత సెప్టెంబర్లో కురిసిన వర్షాలకు పూత అంతగా రాలేదు. దీంతో జనవరి, ఫిబ్రవరిలో పూత రాగా, ఆ ప్రభావం సరఫరాపై పడింది. మార్కెట్లో అక్కడక్కడా మామిడి కనిపిస్తున్నా ధరలు మాత్రం మండిపోతున్నాయి. కిలో రూ.150-250 మధ్య పలుకుతున్నాయి.
News April 11, 2025
వైజాగ్ నుంచి మరిన్ని విమాన సర్వీసులు రద్దు

AP: విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నుంచి వచ్చే నెల బ్యాంకాక్, కౌలాలంపూర్కు సర్వీసులు రద్దు కానున్నాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో ఎయిర్లైన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడకు రెండు సర్వీసులు, దుబాయ్ సర్వీస్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. వీటిని కొనసాగించేలా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చర్యలు తీసుకోవాలని పారిశ్రామికవేత్తలు, నాయకులు, ప్రజలు కోరుతున్నారు.