News June 5, 2024

భూగర్భజలాలు 3.5డిగ్రీలు వేడెక్కుతాయి: అధ్యయనం

image

శతాబ్ధం చివరినాటికి భూగర్భ జలాలు 2-3.5డిగ్రీల వరకు వేడెక్కుతాయని ఓ పరిశోధన తెలిపింది. దీనివల్ల నీటినాణ్యత, పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. జర్మనీలోని కార్ల్స్‌రుహ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన పరిశోధకుల బృందం ఈ అధ్యయనం చేసింది. వాతావరణ మార్పుల ప్రభావం భూగర్భ జలాలపై ఎలా ఉంటుందో వివరించింది.

Similar News

News December 7, 2025

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకుంటున్నారా?

image

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకోవడం ఆరోగ్యానికి మేలు కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వలన చలి తీవ్రత పెరగడమే కాకుండా గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చల్లగాలి శరీరాన్ని తాకితే ఉదయం నిద్రలేవగానే కండరాల బలహీనత ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిపై ప్రభావితం చూపిస్తుందంటున్నారు.

News December 7, 2025

జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

image

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్‌‌లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.

News December 7, 2025

వేసవిలో స్పీడ్‌గా, చలికాలంలో స్లోగా కదులుతున్న హిమానీనదాలు

image

ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిమానీనదాలు వేసవిలో వేగంగా, శీతాకాలంలో నెమ్మదిగా కదులుతున్నట్లు నాసా గుర్తించింది. దశాబ్దం పాటు సేకరించిన శాటిలైట్ డేటా ఆధారంగా 36 మిలియన్లకుపైగా ఫొటోలను పరిశీలించి జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ శాస్త్రవేత్తలు స్టడీ చేశారు. 5 sq.km కంటే పెద్దవైన హిమానీనదాల ఫొటోలను పోల్చి కాలానుగుణంగా వాటి కదలికలను గుర్తించారు. ఫ్యూచర్‌లో హిమానీనదాల కరుగుదల అంచనాలో కదలికలు కీలకం కానున్నాయి.