News October 26, 2024
గ్రూప్-1: మరో అభ్యర్థి డిబార్

TG: గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన అభ్యర్థిని ఎగ్జామినర్లు డిబార్ చేశారు. హైదరాబాద్‌లోని నారాయణమ్మ కాలేజీలో చిట్టీలు తీసుకొచ్చి రాస్తున్నట్లుగా గుర్తించారు. నిన్న సీవీఆర్ కాలేజీలో ఓ అభ్యర్థిని డిబార్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇవాళ పరీక్షకు 21,181 మంది అభ్యర్థులు హాజరయ్యారు. హాజరు శాతం 67.4గా నమోదైంది. రేపటితో మెయిన్స్ పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News December 31, 2025
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయా?

మహిళల గర్భాశయంలో ఏర్పడే గడ్డలనే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి రకరకాల పరిమాణాల్లో ఏర్పడతాయి. ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి లాంటి లక్షణాలు ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడడం మూలంగా మూత్రసంబంధ సమస్యలు వస్తాయి. ✍️ ఫైబ్రాయిడ్స్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>లోకి వెళ్లండి.
News December 31, 2025
ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

<
News December 31, 2025
పుణ్య స్నానాలు – రకాలు

*మాన స్నానం: విభూతి రాసుకుని, ఈశ్వరుడిని ధ్యానిస్తూ చేసే స్నానం. *ధ్యాన స్నానం: పవిత్ర నదులను స్మరిస్తూ చేసే స్నానం. *మంత్ర స్నానం: పవిత్ర మంత్రాలను ఉచ్ఛరిస్తూ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం.
*మృత్తికా స్నానం: పుణ్యక్షేత్రాలు, పవిత్ర ప్రదేశాల నుంచి తెచ్చిన మట్టిని ఒంటికి రాసుకుని చేసే స్నానం.
*దివ్య స్నానము: ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండ కాస్తుండగా, వాన చినుకులలో చేసే స్నానం.


