News October 20, 2024
ఎవరేం చేసినా గ్రూప్-1 పరీక్ష ఆగదు: మంత్రి సీతక్క

TG: ఎవరేం చేసినా గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఆగదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. అభ్యర్థులు ప్రతిపక్షాల ట్రాప్‌లో పడొద్దని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకులు జరిగాయని ఆమె ఆరోపించారు. పదేళ్లలో గ్రూప్-1, డీఎస్సీ పరీక్షలు నిర్వహించలేదని, ఇప్పుడేమో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు.
Similar News
News February 6, 2026
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 5,138 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News February 6, 2026
గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

దేశంలో ఉద్యోగ మార్కెట్ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్ పేజ్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్ హెడ్స్‌కు డిమాండ్ పెరిగిందని తెలిపింది.
News February 6, 2026
ఆఫీస్ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్

TG: హైదరాబాద్‌లో ఆఫీస్ స్పేస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్ చదరపు అడుగుల గ్రేడ్-ఏ ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగాల నుంచి డిమాండ్ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.


