News March 17, 2024

జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులకు గ్రూప్-1 పరీక్ష

image

ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా 33 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ గౌతమీ తెలిపారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 11,587 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్లు తెలిపారు. అభ్యర్థుల సౌలభ్యం కోసం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు.

Similar News

News February 4, 2026

ఈనెల 9 నుంచి FA-4 & ఫ్రీ ఫైనల్ పరీక్షలు: DEO

image

జిల్లాలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో DEO ప్రసాద్ బాబు మాట్లాడుతూ.. 1-9వ తరగతి వరకు FA-4 పరీక్షలు ఈనెల 9 నుంచి 12 వరకు జరుగుతాయన్నారు. పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు ఈనెల 9 నుంచి 19 వరకు జరుగుతాయన్నారు. ప్రశ్న పత్రాలను జిల్లా కేంద్రం నుంచి అన్ని మండలాల MRCలలో భద్రపరుస్తున్నామన్నారు.

News February 4, 2026

బెస్ట్ బ్యూటీషియన్ అవార్డు పొందిన అనంతపురం మహిళ

image

అనంతపురం నగరానికి చెందిన ప్రముఖ బ్యూటీషియన్ హసీనా బేగం ప్రతిష్టాత్మకమైన ‘బెస్ట్ బ్యూటీషియన్’ అవార్డును అందుకున్నారు. బెంగళూరులో కర్ణాటక బ్యూటీ పార్లర్ అసోసియేషన్ నిర్వహించిన బ్యూటెక్ ఎక్స్‌పోలో ఆమెకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. మహిళలకు ఎంతో గౌరవప్రదమైన, అనుకూలమైన ఈ వృత్తిలో రాణిస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం సంతోషంగా ఉందన్నారు.

News February 4, 2026

శ్రీ సత్యసాయి: స్నేహితుడి చేతిలో దారుణ హత్య.. కారణమిదే!

image

ఆవేశంలో స్నేహితుడిని హత్య చేసిన ఘటన రొద్దం(M) పెదకోడిపల్లిలో జరిగింది. లింగమయ్య(28), మనోజ్ స్నేహితులు. ఓ వివాహేతర సంబంధం విషయమై వీరిద్దరూ కొన్నాళ్లుగా మాట్లాడుకోవడం లేదు. మంగళవారం మరికొందరు మిత్రులతో కలిసి గ్రామ శివారులో సమావేశమయ్యారు. వీరిద్దరూ నడుచుకుంటూ వెళ్తుండగా మనోజ్ ఆగ్రహంతో కత్తితో లింగమయ్య గొంతులో పొడిచాడు. లింగమయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మనోజ్ పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.