News May 1, 2024
ఓఎంఆర్ విధానంలో గ్రూప్-1 పరీక్ష: TSPSC

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో(ఓఎంఆర్ విధానం) నిర్వహించనున్నట్లు TSPSC ప్రకటించింది. 563 ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 19న గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
Similar News
News March 14, 2026
పుచ్చకాయ కొనేటప్పుడు ఇవి గమనించండి!

పుచ్చకాయపై ఉండే మచ్చ పసుపు/నారింజ రంగులో ఉంటే పండినట్లు, తెల్లగా ఉంటే ఇంకా పండనట్లు. గుండ్రటి కాయలు తీయగా ఉంటాయి. పొడవుగా ఉండేవి తక్కువ తీపి కలిగి ఉంటాయి. ఒకే సైజులో ఉన్న వాటిలో బరువు ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి. వాటిలో గుజ్జు, రసం ఎక్కువగా ఉంటాయి. కాయ కాడ పూర్తిగా ఎండిపోయి, మెరుపు తక్కువగా ఉంటే అది సహజంగా పాదుపైనే పండిందని అర్థం. గోధుమ రంగు గీతలు ఉన్న కాయలు చాలా తీయగా ఉంటాయి.
News March 14, 2026
పుతిన్ ప్రపోజల్‌కు నో చెప్పిన ట్రంప్!

ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల (60% శుద్ధి చేసిన) యురేనియంను రష్యాకు తరలించాలని పుతిన్ చేసిన ప్రతిపాదనను ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. యుద్ధాన్ని ఆపేందుకు ఇది ఒక మార్గమని పుతిన్ చెప్పినట్లు తెలిపింది. ఈ యురేనియంతో సుమారు 11 అణు బాంబులను తయారు చేయవచ్చని సమాచారం. అందుకే ఈ యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవాలి లేదా పనికిరాకుండా చేయాలని US ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
News March 14, 2026
రోహిత్ శర్మను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడించొద్దు: ఆకాశ్ చోప్రా

IPL-2026లో MI తమ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను ఇంపాక్ట్ సబ్‌గా కాకుండా పూర్తిస్థాయి ప్లేయర్‌గా ఆడించాలని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సూచించారు. రోహిత్ ప్రస్తుతం గతంలో కంటే ఫిట్‌గా ఉన్నారని, ఆయన సేవలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనుభవం ఉన్న లీడర్ మైదానంలో ఉంటే కెప్టెన్ హార్దిక్‌కు హెల్ప్ అవుతుందని అభిప్రాయపడ్డారు. గత సీజన్‌లో హిట్‌మ్యాన్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్ మాత్రమే చేశారు.


