News October 17, 2024
కేసులు పరిష్కరించాకే గ్రూప్-1 పరీక్షలు పెట్టాలి: రాకేశ్ రెడ్డి

TG: కోర్టు కేసులన్నీ పరిష్కరించిన తర్వాతనే రాష్ట్రంలో గ్రూప్-1 పరీక్షలు నిర్వహించాలని BRS నేత రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ‘జీఓ 29 వర్సెస్ 55తోపాటు అనేక కేసులు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని పరిష్కరించి పరీక్ష నిర్వహిస్తుందా? లేదా పట్టించుకోకుండా నిర్వహిస్తుందా? కోర్టు తీర్పు తర్వాత మళ్లీ మెయిన్స్ పరీక్ష పెడతారా? ఈ విషయంలో అభ్యర్థులు సందిగ్ధంలో ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు.
Similar News
News February 21, 2026
సిరీస్ పట్టేస్తారా? నేడే AUSతో చివరి టీ20

మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచులో భారత మహిళల జట్టు ఇవాళ ఆస్ట్రేలియాతో తలపడనుంది. అడిలైడ్ వేదికగా మధ్యాహ్నం 1.45 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. తొలి టీ20లో వర్షం పడటంతో D/L పద్ధతిలో భారత్ విజయం సాధించింది. రెండో మ్యాచులో ఆసీస్ చేతిలో 19 రన్స్ తేడాతో ఓడింది. దీంతో ఈ మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారింది. ఇక AUS పర్యటనలో భారత జట్టు 3 వన్డేలు, ఒక టెస్ట్ కూడా ఆడనుంది.
News February 21, 2026
అవకాడో సాగు.. మొక్కలు నాటే విధానం

వసంతకాలంలో తగినంత ఉష్ణ వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు అవకాడో అంటుకట్టిన మొక్కలను లేదా మొగ్గ తొడిగిన మొక్కలను నాటాలి. 1x1x1 అడుగుల పొడవు, వెడల్పు, లోతు ఉండే విధంగా గుంతలను తవ్వుకొని 1 : 1 : 1 నిష్పత్తిలో మట్టి, ఇసుక మరియు పశువుల ఎరువుల మిశ్రమాన్ని నింపాలి. అనంతరం మొక్కలను నాటుకోవాలి. వరుసలలోని 2 మొక్కలకి మధ్య దూరం 15- 20 అడుగులు ఉండాలి. రెండు వరుసలకు మధ్య 20 అడుగుల దూరం ఉండేలా చూసుకోవాలి.
News February 21, 2026
కర్నూలు WDCWలో ఉద్యోగాలు.. దరఖాస్తుల ఆహ్వానం

AP: కర్నూలు మహిళాభివృద్ధి& శిశు సంక్షేమశాఖ (WDCW)లో 13పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఫిబ్రవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి LLM/సోషల్ వర్క్/సోషల్ సైన్స్/ సైకాలజీ, LLB, పారా మెడికల్ (డిగ్రీ/డిప్లొమా), డిగ్రీ, డిప్లొమా, టెన్త్ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18-39ఏళ్ల మధ్య ఉండాలి. జీతం రూ.13000-రూ.34,000 వరకు చెల్లిస్తారు. సైట్: https://kurnool.ap.gov.in./


