News July 31, 2024
సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగమిస్తాం: సీఎం రేవంత్

TG: టీమ్ ఇండియా క్రికెటర్ సిరాజ్‌కు గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సిరాజ్ ఉండటం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన అన్నారు. అన్ని మినహాయింపులతో ఆయనకు ఉద్యోగం ఇచ్చేలా క్యాబినెట్‌లో చర్చిస్తామని స్పష్టం చేశారు. గత కొన్నేళ్లుగా అన్ని ఫార్మాట్లలో భారత్ సాధించిన చిరస్మరణీయ విజయాల్లో సిరాజ్ కీలక పాత్ర పోషించారు.
Similar News
News March 24, 2026
అనిల్ ‘మల్టీస్టారర్’ జూన్‌లో షురూ!

వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌తో డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించే మల్టీస్టారర్ మూవీ షూటింగ్ జూన్ నుంచి మొదలవుతుందని సమాచారం. కామెడీ, యాక్షన్ అంశాలతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఓ హీరోయిన్‌గా కీర్తి సురేశ్‌ను ఖరారు చేశారని, మరో కథానాయిక కోసం మేకర్స్ పలు ఆప్షన్లు పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది చివరికి షూటింగ్ కంప్లీట్ చేసి 2027 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నారు.
News March 24, 2026
తగ్గిన అమెరికా వీసాలు.. భారత్, చైనాపైనే ప్రభావం

ట్రంప్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన రూల్స్ వల్ల అమెరికా వీసాల జారీ భారీగా తగ్గింది. భారత్, చైనా పౌరులపై ఈ ప్రభావం అధికంగా ఉంది. గతేడాది కేవలం 2.5 లక్షల వీసాలే జారీ చేయగా శాశ్వత, తాత్కాలిక నివాస వీసాల్లో 11% తగ్గించారు. ముఖ్యంగా భారత్, చైనాలకు సంబంధించి 84 వేల వీసాలు తగ్గడంతో అక్కడికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.
News March 24, 2026
ఆర్టీసీలో సమ్మె హెచ్చరికలు.. రేపు చర్చలు

TG: తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 26 తర్వాత సమ్మెకు దిగుతామని RTC JAC హెచ్చరించడంతో ప్రభుత్వం స్పందించింది. రేపు HYDలోని అంజయ్య భవన్‌లో చర్చలకు రావాలని సంస్థ ప్రతినిధులు, JAC ప్రతినిధులను ఆహ్వానించింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, సంస్థలోకి యూనియన్ల అనుమతి, 2021, 2025 జీత భత్యాల సవరణ, డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతపై మార్గదర్శకాలు, బకాయిలను విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.


