News March 17, 2024
గ్రూప్-1 ఉద్యోగాలు.. ఒక్క పోస్టుకు 715 మంది పోటీ!

TG: రాష్ట్రంలో 563 గ్రూప్-1 ఉద్యోగాలకు మొత్తం 4.03లక్షల దరఖాస్తులు వచ్చాయి. అంటే ఒక్క పోస్టుకు దాదాపు 715 మందికి పైగా పోటీ పడుతున్నారు. 2022 నోటిఫికేషన్తో పోలిస్తే ఈసారి 23 వేల అప్లికేషన్లు అదనంగా వచ్చాయి. దరఖాస్తుల సవరణకు ఈనెల 23 నుంచి 27 వరకు అవకాశం కల్పించనున్నారు. జూన్ 9న ప్రిలిమ్స్ పరీక్ష, అక్టోబర్ 21న మెయిన్స్ నిర్వహించనున్నారు.
Similar News
News November 19, 2025
NZB: వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి: DMHO

NZB జిల్లాలోని PHCలు, సబ్ సెంటర్లలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి (DMHO) డా.రాజశ్రీ ఆదేశించారు. అవుట్ పేషెంట్ల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. గర్భిణుల వివరాల నమోదులో అలసత్వం వహించే ANMలు, ఆశా కార్యకర్తలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యాధి నిరోధక టీకాల ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సూచించారు.
News November 19, 2025
భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,200 పెరిగి రూ.1,24,860కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ. 1,100 ఎగబాకి రూ.1,14,450 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 పెరిగి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 19, 2025
పండ్ల తోటల్లో పిందె/కాయలు ఎందుకు రాలిపోతాయి?

పండ్ల తోటల్లో పుష్పాలు సరిగా సంపర్కం చెందకపోతే పిందె సరిగా కట్టదు. ఒకవేళ కట్టినా కాయలు ఎదగక మధ్యలోనే రాలిపోతాయి. తోటల్లో సజ్రతని, బోరాన్, కాల్షియం, పొటాష్ పోషకాలు, హోర్మోన్ల లోపం వల్ల కూడా పిందెలు, కాయ ఎదిగే దశల్లో రాలిపోతాయి. రసం పీల్చే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ, బూడిద తెగుళ్లు, అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలులు, రాత్రివేళ అల్ప ఉష్ణోగ్రతలు, ఆకస్మిక వర్షాల వల్ల పండ్ల తోటల్లో పిందెలు, కాయలు రాలుతాయి.


