News October 21, 2024

నేటి నుంచి గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్.. భారీ బందోబస్తు

image

తెలంగాణలో 563 గ్రూప్-1 పోస్టులకు నేటి నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. పరీక్షను వాయిదా వేయాలంటూ కొందరు అభ్యర్థులు నిరసనలు చేస్తున్న నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ రూమ్, చీఫ్ సూపరింటెండెంట్, పరిసర ప్రాంతాల్లో CC కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. పరీక్షా కేంద్రాలకు 200 మీటర్ల వరకు ఐదుగురికి మించి ఉండకుండా పోలీసులు BNSS 163 సెక్షన్ విధించారు.

Similar News

News October 21, 2024

KCR ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదు: కోదండరాం

image

TG: రాష్ట్ర ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే తెలంగాణ స్వరాష్ట్రం వచ్చిందని, KCR ఒక్కడి వల్లే రాలేదని MLC కోదండరాం అన్నారు. నిజామాబాద్ TNGOs భవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆయన మాట్లాడారు. ‘తెలంగాణ కోసం ఎన్నో సంఘాలు ఉద్యమించాయి. ఎందరో బలిదానాలు చేయడంతో రాష్ట్రం సిద్ధించింది. KCR తన స్వలాభం కోసం ఉద్యమ చరిత్రను వక్రీకరిస్తున్నారు. పదేళ్ల పాలనలో నిరుద్యోగ సమస్యలను BRS తీర్చలేదు’ అని ఆయన విమర్శించారు.

News October 21, 2024

రేషన్ కార్డులపై శుభవార్త?

image

TG: రేషన్ కార్డుల్లో అర్హుల పేర్లు చేర్చడంపై ప్రభుత్వం త్వరలోనే తీపికబురు అందించనుంది. కుటుంబంలో పిల్లలు, కోడలు, కొత్త సభ్యుల పేర్లు నమోదు కోసం లక్షల మంది ఎదురుచూస్తున్నారు. దాదాపు 10 లక్షల మందికి పైగా పేర్లు చేర్చాలని దరఖాస్తు చేశారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుల అంశం పూర్తయ్యాక పేర్లు నమోదు చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమాచారం.

News October 21, 2024

నెరవేరనున్న ‘వరంగల్ ప్రజల’ చిరకాల వాంఛ

image

TG:’కాజీపేటలో కోచ్‌ఫ్యాక్టరీ’ కోసం వరంగల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. నిన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి <<14406395>>ప్రకటనతో<<>> వారి కల త్వరలోనే నెరవేరనుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీలో వందేభారత్, స్లీపర్ కోచ్‌లు తయారీ కానున్నాయి. ఇటీవలే దీనిపై RVNL, రైల్వే బోర్డు మధ్య చర్చలు జరిగాయి. ఇప్పటికే వ్యాగన్ మాన్యుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ ఇక్కడ సిద్ధం అవుతుండగా, కోచ్ ఫ్యాక్టరీ కూడా వస్తే ఓరుగల్లు రూపురేఖలే మారిపోతాయి.