News March 17, 2024
నేడు గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష

AP: రాష్ట్రంలో ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ పరీక్షకు 1,48,881 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 301 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు పేపర్-1, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరగనున్నాయి. పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ విధించనున్నారు.
Similar News
News September 7, 2025
చంద్రుడిని చూశారా?

సంపూర్ణ చంద్రగ్రహణం ప్రక్రియ ప్రారంభమైంది. వెలుగులు ప్రసరిస్తూ ప్రకాశవంతంగా మెరిసిపోతున్న చందమామను మెల్లగా చీకటి కమ్మేస్తోంది. 11 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది మొత్తం 82 నిమిషాల పాటు కొనసాగనుంది. ఇప్పటికే దేశ ప్రజలు ధగధగా మెరుస్తున్న చంద్రుడిని చూస్తూ పులకరిస్తున్నారు. మరి మీరు చందమామను చూశారా?
News September 7, 2025
మెట్రో టెండర్ల గడువు పొడిగింపు

AP: విజయవాడ, విశాఖ మెట్రో టెండర్ల గడువు పొడిగించినట్లు AP మెట్రో రైల్ కార్పొరేషన్ MD రామకృష్ణారెడ్డి తెలిపారు. VJA మెట్రో టెండర్ల గడువు అక్టోబరు 14, విశాఖకు సంబంధించి అక్టోబరు 7వరకు పొడిగించామన్నారు. టెండర్ల ప్రీబిడ్ సమావేశంలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి వినతులు రాగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. విశాఖ మెట్రో ఫేజ్-1 కింద 46.23KM, VJA మెట్రో ఫేజ్-1లో 38KM నిర్మాణానికి టెండర్లు పిలిచామని చెప్పారు.
News September 7, 2025
ప్రధాని మోదీకి కేజ్రీవాల్ సవాల్

భారత్ ఎగుమతులపై అమెరికా భారీ టారిఫ్లు విధించిన నేపథ్యంలో PM మోదీకి ఆప్ అధినేత కేజ్రీవాల్ సవాల్ విసిరారు. US దిగుమతులపై 75% సుంకాలు విధించి ప్రధాని ధైర్యసాహసాలు చూపించాలన్నారు. ఈ నిర్ణయం తీసుకుంటే దేశ ప్రజలు వెన్నంటే ఉంటారని తెలిపారు. అధిక పన్నులు విధించాలని, ఆ తర్వాత ట్రంప్ మనముందు మోకరిల్లుతారో లేదో చూడాలని సూచించారు. అంతేగాని US ముందు మోదీ ఎందుకు మోకరిల్లుతున్నారో అర్థం కావడంలేదన్నారు.