News May 25, 2024

గ్రూప్-1 ప్రిలిమ్స్‌.. TGPSC కఠిన రూల్స్(1/2)

image

TG: గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహణకు TGPSC కఠిన నిబంధనలు రూపొందించింది. జూన్ 9న ఉ.10.30-మ.ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది.
✒ హాల్‌టికెట్‌ను A4 సైజ్ ప్రింట్ తీసుకోవాలి.
✒ అందులో ఫొటో సరిగ్గా లేకుంటే గెజిటెడ్ అధికారి/చివరగా చదువుకున్న విద్యాసంస్థ ప్రిన్సిపల్ అటెస్ట్ చేసిన 3 పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను రెడీ చేసుకోవాలి.
✒ కమిషన్ వెబ్‌సైట్లో పొందుపరిచిన ధ్రువీకరణ పత్రాన్ని పూర్తిచేసి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.

Similar News

News January 26, 2026

వనపర్తి: భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ ఆదర్శ్ సురభి

image

రైతుల భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘భూ భారతి’ చట్టాన్ని తెచ్చిందని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి జిల్లాలో ఇప్పటివరకు వచ్చిన 2,114 దరఖాస్తుల్లో 1,450 దరఖాస్తులను పరిష్కరించామని వెల్లడించారు. రేవల్లి, ఏదుల, శ్రీరంగాపూర్ మండలాల్లో రూ.96 లక్షలతో నిర్మిస్తున్న ఎంఆర్ఓ కార్యాలయాల పనులు తుది దశకు చేరుకున్నాయని, త్వరలోనే వీటిని అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు.

News January 26, 2026

ఫ్రెండ్ పెళ్లి కోసం 15 కేజీలు తగ్గిన మహిళ.. చివరికి!

image

తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లిలో అందంగా కనిపించడం కోసం చైనాలో జియాయు అనే 26 ఏళ్ల యువతి కఠిన డైట్ పాటించింది. రోజూ 10KM రన్నింగ్ చేస్తూ తక్కువ మొత్తంలో వెజిటబుల్స్, చికెన్ తినేది. దీంతో 2 నెలల్లోనే 15KGల బరువు తగ్గింది. ఆమె తన డైట్ నుంచి కార్బొహైడ్రేట్స్‌ను తీసేయడం, హై ఇంటెన్సిటీ ఎక్సర్‌సైజ్ వల్ల ప్రీ డయాబెటిస్ బారిన పడింది. డాక్టర్ల వార్నింగ్‌తో ఆమె డైటింగ్‌ను ఆపేసింది.

News January 26, 2026

బాలిక ప్రాణం తీసిన చైనా మాంజా

image

TG: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. చైనా మాంజా మరొకరి ప్రాణం తీసింది. తండ్రితో కలిసి బైక్‌పై వెళ్తున్న ఐదేళ్ల నిష్విక(5) మెడను మాంజా మహమ్మారి కోసేసింది. దీంతో తీవ్ర రక్తస్రావంతో చిన్నారి విలవిల్లాడింది. తండ్రి వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. <<18870079>>చైనా మాంజా<<>>పై ఇండియాలో నిషేధం ఉన్నా, పోలీసుల హెచ్చరికలు ఉన్నా వాటి అమ్మకాలు ఆగకపోవడం శోచనీయం.