News March 10, 2025
నేడు గ్రూప్-1 రిజల్ట్

TG: నేడు గ్రూప్-1 ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించనుంది. ఈ మేరకు ప్రొవిజనల్ మార్కుల జాబితాను రిలీజ్ చేయనుంది. మొత్తం 563 పోస్టులకుగానూ గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన మెయిన్స్‌కు 21,093 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక రేపు గ్రూప్-2 అభ్యర్థుల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్, 14న గ్రూప్-3 పరీక్ష జనరల్ ర్యాంకింగ్ జాబితాను రిలీజ్ చేయనున్నారు.
Similar News
News March 10, 2025
అధికారిక లాంఛనాలతో గరిమెళ్ల అంత్యక్రియలు

AP: టీటీడీ ఆస్థాన గాయకులు, ప్రముఖ సంగీత విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుపతిలోని స్వగృహంలో ఆయన నిన్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. గరిమెళ్ల ఇద్దరు కుమారులు అమెరికా నుంచి మంగళవారం తిరుపతి చేరుకోనున్నారు. దీంతో ఆయన అంత్యక్రియలను రేపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
News March 10, 2025
శ్రీదేవి చివరి సినిమాకు సీక్వెల్.. హీరోయిన్ ఎవరంటే?

శ్రీదేవి నటించిన చివరి సినిమా ‘MOM’కు సీక్వెల్ తీయబోతున్నట్లు ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు. ఇందులో తమ రెండో కూతురు ఖుషీ కపూర్ ప్రధాన పాత్రలో కనిపిస్తారని పేర్కొన్నారు. ‘ఖుషీ తన తల్లి అడుగుజాడల్లో నడవడానికి ప్రయత్నిస్తోంది. నటించిన అన్ని భాషల్లో శ్రీదేవి టాప్ హీరోయిన్‌గా ఎదిగారు. జాన్వీ, ఖుషీ కపూర్ కూడా ఆ స్థాయిలో సక్సెస్ అవుతారని నమ్ముతున్నా’ అని ఓ ఈవెంట్‌లో పేర్కొన్నారు.
News March 10, 2025
జడేజా భార్యపై ప్రశంసలు!

న్యూజిలాండ్‌ను టీమ్ఇండియా ఓడించి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అనంతరం జట్టుతో కుటుంబసభ్యులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన భార్య రివాబా జడేజా, కూతురుతో కలిసి ట్రోఫీతో ఫొటోలు దిగారు. అయితే, విదేశాల్లో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌కూ సంప్రదాయబద్ధంగా చీరలో వచ్చి రివాబా అందరి దృష్టినీ ఆకర్షించారు. నెట్టింట ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.