News October 4, 2024

నిపుణుల కమిటీ నిర్ణయం తర్వాతే గ్రూప్-1 ఫలితాలు: TGPSC

image

TG: 563 గ్రూప్-1 ఉద్యోగాలకు జూన్‌‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షల కీపై అభ్యంతరాలు స్వీకరించామని TGPSC హైకోర్టుకు తెలిపింది. 7వేలకు పైగా అభ్యంతరాలను నిపుణుల కమిటీకి పంపామని, వారు ఆమోదించిన తర్వాతే ఫలితాలు విడుదల చేస్తామని నివేదించింది. 2022లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయకుండా కొత్తది విడుదల చేయడం చెల్లదని, కీపై అభ్యంతరాలను పట్టించుకోవట్లేదని పలువురు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Similar News

News November 2, 2025

ఈ దున్న ఖరీదు రూ. 23 కోట్లు.. ఎందుకంత స్పెషల్?

image

హరియాణాకు చెందిన అన్మోల్ అనే ఈ దున్న రాజస్థాన్‌ పుష్కర్ పశువుల సంతలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 1,500 Kgల బరువుండే ఈ దున్న ఖరీదు రూ.23 కోట్ల పైనే. దీని వీర్యానికి చాలా డిమాండ్ ఉంది. వారానికి 2సార్లు అన్మోల్ వీర్యాన్ని సేకరించి విక్రయిస్తారు. ఇలా నెలకు కనీసం రూ.5 లక్షల ఆదాయం వస్తోంది. దీనికి ఆహారం కోసం నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది.✍️ రోజూ ఇలాంటి సమాచారానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.

News November 2, 2025

రాష్ట్రంలో ‘మిట్టల్ స్టీల్’కు పర్యావరణ అనుమతులు!

image

AP: అనకాపల్లి సమీపంలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పాన్ స్టీల్స్ ఏర్పాటు చేయబోతున్న ఉక్కు పరిశ్రమకు నిపుణుల కమిటీ పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది. 14 నెలల రికార్డ్ టైమ్‌లో ఇది సాధ్యమైనట్లు ప్రభుత్వం తెలిపింది. రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఫ్యాక్టరీగా నిలవనుంది. ఈనెల 14, 15 తేదీల్లో జరగనున్న CII సదస్సులో దీనికి భూమిపూజ చేయనున్నారు.

News November 2, 2025

రాజమండ్రిలోని NIRCAలో 27 ఉద్యోగాలు

image

రాజమండ్రిలోని ICAR- <>NIRCA<<>>(నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమ్యూనల్ అగ్రికల్చర్)లో 27 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు NOV 14లోగా ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి ఎంటెక్, MSc(అగ్రోనమీ), బీటెక్, BSc( అగ్రికల్చర్/లైఫ్ సైన్స్/అగ్రికల్చర్ డిప్లొమా), MSc(అగ్రికల్చర్/మాలిక్యులార్ బయాలజీ/ బయో టెక్నాలజీ/జెనిటిక్స్/లైఫ్ సైన్స్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.