News March 10, 2025
గ్రూప్-1 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <
Similar News
News March 10, 2025
అమరావతిలో 13 సంస్థల భూ కేటాయింపులు రద్దు

ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో 13 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేసింది. మరో 31 సంస్థలకు భూ కేటాయింపులను కొనసాగించాలని నిర్ణయించింది. 16 సంస్థల భూములకు లొకేషన్, ఎక్స్టెన్షన్ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ తెలిపారు. గత ప్రభుత్వం కక్షసాధింపుతో రాజధానిపై మూడు ముక్కలాట ఆడిందని ఆయన ఆరోపించారు.
News March 10, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తోన్న ‘ది రాజాసాబ్’ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉందని సినీవర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాలో ఎంతో కీలకంగా ఉన్న VFX పనులు ఇంకా పూర్తికావాల్సి ఉన్నట్లు వెల్లడించాయి. దీంతో ముందుగా ప్రకటించినట్లు ఏప్రిల్ 10న విడుదల కావట్లేదని తెలిపాయి. దీనిపై మేకర్స్ ప్రకటన చేయాల్సి ఉంది. దీంతో అభిమానులకు నిరాశే ఎదురైంది.
News March 10, 2025
రిటైర్మెంట్ వార్తలు.. స్పందించిన జడేజా

వన్డేలకు తాను రిటైర్మెంట్ ప్రకటిస్తానని జరుగుతున్న ప్రచారంపై టీమ్ ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఖండించారు. తన రిటైర్మెంట్పై వస్తున్న రూమర్స్ నమ్మవద్దని అభిమానులను కోరాడు. థాంక్స్ అంటూ ఇన్స్టాలో రాసుకొచ్చాడు. దీంతో తదుపరి వరల్డ్ కప్ వరకు జడ్డూ భారత జట్టుకు ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ వార్తలను ఖండించిన సంగతి తెలిసిందే.