News October 21, 2024

గ్రూప్-1.. సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం

image

TG: గ్రూప్-1పై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభం అయింది. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే పిటిషన్‌ను న్యాయమూర్తి పాస్ ఓవర్ చేశారు. లిస్ట్‌లో పిటిషన్లపై విచారణ మొత్తం పూర్తయ్యాక దీన్ని విచారణకు స్వీకరిస్తామని చెప్పారు. కాగా గ్రూప్-1 అభ్యర్థుల తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ వాదనలు వినిపించనున్నారు.

Similar News

News October 21, 2024

రైలులో టపాసులు తీసుకెళ్లొచ్చా?

image

దీపావళి సమీపిస్తోంది. చాలామంది పట్టణాల నుంచి సొంతూళ్లకు వెళుతుంటారు. ఈక్రమంలోనే బాణసంచా కొని ట్రైన్‌లో తీసుకెళదామనుకుంటారు. అయితే రైల్వే సేఫ్టీ రూల్స్ ప్రకారం మండే స్వభావం ఉన్న ఫైర్ క్రాకర్స్‌ను రైలులో తీసుకెళ్లడం నిషిద్ధం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రూ.1000 జరిమానాతో పాటు 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్‌ స్టవ్స్, సిలిండర్స్, యాసిడ్స్ వంటివి కూడా తీసుకెళ్లడానికి అనుమతి లేదు.

News October 21, 2024

CSKతోనే ధోనీ.. ఆ జట్టు సీఈవో ఏమన్నారంటే?

image

ఐపీఎల్‌లో CSK తరఫున ఎంఎస్ ధోనీ ఆడటంపై ఆ జట్టు సీఈవో కాశీ విశ్వనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ కూల్ జట్టుకు ఆడాలని తాము కూడా కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే దీనిపై ధోనీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉందన్నారు. ఈ విషయమై ఈ నెల 31లోపు నిర్ణయాన్ని వెల్లడిస్తానని MS చెప్పినట్లు పేర్కొన్నారు. మరోవైపు ధోనీని అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా CSKలో తీసుకుంటారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.

News October 21, 2024

రతన్ టాటా నాకూ సలహాలిచ్చేవారు: బ్రిటన్ మాజీ PM

image

చంద్రుడి సౌత్‌పోల్‌లో రోవర్‌ను దించిన చంద్రయాన్3 సహా అనేక అంశాల వల్ల భారత్‌పై వెస్ట్ దృష్టికోణం మారిందని బ్రిటన్ మాజీ PM డేవిడ్ కామెరాన్ అన్నారు. జాగ్వార్‌ను టాటా కొనడంతో UKలో జపాన్‌ పెట్టుబడుల్ని భారత్ దాటేసిందన్నారు. ‘టాటా పెట్టుబడి నాకో వేకప్‌ కాల్‌. ప్రపంచ స్థాయికి భారత ఎకానమీ ఎదిగిందని, గొప్ప పనులు చేయబోతోందని గ్రహించాను. నేను PMగా ఉన్నప్పుడు రతన్ టాటా నాకు సలహాదారుగా ఉండేవారు’ అని అన్నారు.