News May 24, 2024
గ్రూప్-2, 3 పోస్టులు పెంచి పరీక్షలు నిర్వహించాలి: నిరుద్యోగులు

TG: గ్రూప్-2, 3 నోటిఫికేషన్లలో పోస్టుల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దశాబ్దం తర్వాత ఈ నోటిఫికేషన్లు వచ్చాయని.. గత ప్రభుత్వం ఇచ్చిన ఖాళీలకే పరీక్షలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. TGPSCని ప్రక్షాళన చేసిన సమావేశంలో సీఎం రేవంత్ కూడా పోస్టుల సంఖ్యను పెంచుతామని చెప్పారని గుర్తుచేస్తున్నారు. ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News December 16, 2025
గతంలో ఎన్నడూ లేనంత పురోగతి: ట్రంప్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని US అధ్యక్షుడు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. శాంతి ఒప్పందం విషయంలో గతంలో ఎన్నడూ లేని పురోగతి సాధించినట్లు చెప్పారు. ఇరుదేశాల శాంతికి US చేస్తున్న ప్రయత్నాలకు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, యూకే తదితర యూరోపియన్ దేశాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నట్లు తెలిపారు. బెర్లిన్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో యూరోపియన్ నేతలు చర్చల వేళ ట్రంప్ పైవ్యాఖ్యలు చేశారు.
News December 16, 2025
ఎక్కడ మేసినా పేడ మన పెరట్లోనే వెయ్యాలి

పశువులు పగలంతా బయట ఎక్కడ మేత మేసినా, సాయంత్రానికి తిరిగి తమ యజమాని ఇంటికే చేరుకుంటాయి. అవి వేసే పేడ యజమాని పెరట్లోనే పడుతుంది. అది ఎరువుగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక వ్యక్తి ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎంత పేరు ప్రఖ్యాతలు, డబ్బు సంపాదించినా ఆ లాభం చివరికి తన సొంత ఇంటికి, తన కుటుంబానికి లేదా తన ఊరికే ఉపయోగపడాలని ఈ సామెత చెబుతుంది.
News December 16, 2025
ధనుర్మాసం: తొలిరోజు కీర్తన

‘‘సుసంపన్నమైన గోకులంలో పుట్టిన సుశోభిత గోపికల్లారా! అత్యంత విశిష్టమైన మార్గశిరం ఆరంభమైంది. ఈ కాలం వెన్నెల మల్లెపూలలా ప్రకాశిస్తోంది. శూరుడైన నందగోపుని కుమారుడు, విశాల నేత్రాలు గల యశోద పుత్రుడు, నల్లని మేఘసమాన దేహుడు, చంద్రుడిలా ఆహ్లాదకరుడు, సూర్యుడిలా తేజోమయుడైన నారాయణుడి వ్రతం ఆచరించడానికి సిద్ధం కండి. పుణ్య మార్గళి స్నానమాచరించేందుకు రండి’’ అంటూ గోదాదేవి గొల్లభామలందరినీ ఆహ్వానిస్తోంది.


