News February 23, 2025
ముగిసిన గ్రూప్-2 ఎగ్జామ్

AP: రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహించారు. మొత్తం 175 కేంద్రాల్లో ఎగ్జామ్స్ జరిగాయి. 92,250 మంది మెయిన్స్కు క్వాలిఫై కాగా 79,599 మంది పరీక్షలు రాశారు. వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు, ప్రభుత్వం కోరినా APPSC వెనక్కి తగ్గకుండా నిర్వహించింది. మరి మీరు ఈ ఎగ్జామ్ రాశారా? క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చింది? కామెంట్ చేయండి.
Similar News
News December 30, 2025
కొత్తగా తిరుపతి జిల్లా ఇలా..!

☞ డివిజన్లు: 3 (తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట)
☞ మండలాలు: 36
☞ జనాభా: 29,47,547
☞ నియోజకవర్గాలు: 7
☞ గూడూరును నెల్లూరులో కలపడంతో ఆ డివిజన్లో ఉన్న వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లెను శ్రీకాళహస్తి డివిజన్లో, వాకాడు, చిట్టమూరును సూళ్లూరుపేట డివిజన్లో కలిపారు. రైల్వేకోడూరు నియోజకవర్గం మొత్తం తిరుపతి రెవెన్యూ డివిజన్లోకి వస్తుంది.
News December 30, 2025
థైరాయిడ్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఎప్పుడు ఫుడ్ తీసుకోవాలంటే?

థైరాయిడ్ మందులను ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాత యాభై నిమిషాల తర్వాత ఫుడ్ తీసుకోవాలని చెబుతున్నారు. అప్పుడే శరీరం మందును బాగా గ్రహిస్తుంది. అలాగే థైరాయిడ్ టాబ్లెట్లు వేసుకున్న గంట వరకు థైరాయిడ్ మందుల శోషణకు అంతరాయం కలిగించే యాంటాసిడ్లు, ఇతర మందులను వేసుకోవడం, ఫైబర్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉండే ఆహారాలు తినడం మానుకోవాలని సూచిస్తున్నారు.
News December 30, 2025
451 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

త్రివిధ దళాల్లో 451 ఆఫీసర్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2026 ద్వారా వీటిని భర్తీ చేయనుంది. ఇంజినీరింగ్ డిగ్రీ, డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -24ఏళ్ల మధ్య వయసు గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.200, SC, ST, మహిళలకు ఫీజు లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://upsconline.nic.in.


