News February 20, 2025
యథాతథంగా గ్రూప్-2 పరీక్షలు: APPSC

గ్రూప్-2 మెయిన్ పరీక్షలు వాయిదా పడతాయన్న ప్రచారంలో నిజం లేదని APPSC ఛైర్మన్ అనురాధ స్పష్టం చేశారు. ఈనెల 23న 10am-12.30pm పేపర్-1, 3pm-5.30pm పేపర్-2 నిర్వహిస్తామని తెలిపారు. 175 పరీక్షా కేంద్రాల్లో 92,250 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలకు 100m పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని, సోషల్ మీడియాలో వదంతులు సర్కులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News February 21, 2025
వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

AP: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో YCP నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా పడింది. కౌంటర్ దాఖలుకు పోలీసులు సమయం కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ఆయన కస్టడీ పిటిషన్‌పై తీర్పును న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది. కస్టడీ, హెల్త్ పిటిషన్లపై కోర్టు ఇవాళ విచారణ చేపట్టింది.
News February 21, 2025
టెస్లా కారు రూ.21 లక్షలకు వస్తే మన కంపెనీలకు దెబ్బే.. కానీ!

ఇండియాలో టెస్లా కార్లు రాబోతున్నాయని, వాటి ధర రూ.21 లక్షలు ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఆ కంపెనీలో రూ.21 లక్షల ప్రైస్ రేంజ్‌లో కారే లేదు. మినిమమ్ ధర రూ.34 లక్షలుగా ఉంది. పన్నులతో రూ.40 లక్షల వరకు వెళ్లొచ్చు. ఒకవేళ రూ.21 లక్షల్లో తీసుకొస్తే దేశీయ కంపెనీలైన టాటా, మహీంద్రా ఈవీ మార్కెట్లకు పెద్ద దెబ్బే పడనుంది. రూ.40 లక్షలు, ఆపై ఉంటే లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తుంది. పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు.
News February 21, 2025
ఆందోళన విరమించిన TTD ఉద్యోగులు

AP: తిరుమల శ్రీవారి ఆలయంలో పనిచేసే ఉద్యోగి బాలాజీ సింగ్‌ను బోర్డు సభ్యుడు <<15507901>>నరేశ్<<>> దూషించడంతో 2 రోజులుగా TTD ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తెర పడింది. దూషణ విషయంపై టీటీడీ ఉద్యోగులతో ఈవో శ్యామలరావు, బోర్డు సభ్యులు ఇవాళ భేటీ అయ్యారు. బాలాజీసింగ్ విషయంలో తప్పు జరిగిందని నరేశ్ ఒప్పుకొని, క్షమాపణలు చెప్పినట్లు బోర్డు సభ్యులు తెలిపారు. కుటుంబంలో వచ్చిన చిన్న సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకున్నట్లు వివరించారు.