News February 13, 2025

నేటి నుంచి అందుబాటులోకి గ్రూప్-2 హాల్ టికెట్లు

image

AP: గ్రూప్-2 మెయిన్స్ హాల్ టికెట్లను APPSC విడుదల చేసింది. నేటి నుంచి అభ్యర్థులు వాటిని అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లౌడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నెల 23వ తేదీ ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు పరీక్షలకు వచ్చే సమయంలో హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని APPSC స్పష్టం చేసింది. 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని ఎగ్జామ్ సెంటర్లలో 89,900 మంది పరీక్ష రాయనున్నారు.

Similar News

News February 13, 2025

ఎల్లుండి సెలవా?

image

TG: ఈనెల 15న బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. ఆరోజు పబ్లిక్ హాలిడే ఇవ్వాలని లంబాడాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తోంది. గతేడాది ప్రభుత్వం ఫిబ్రవరి 15న సెలవు ఇచ్చింది. ఈసారి కూడా దాన్ని అమలు చేయాలని వినతులు వస్తున్నాయి. ఇక సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలంటూ CM రేవంత్‌ను మంత్రి సీతక్క, గిరిజన నాయకులు నిన్న కలిసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో సెలవుపై CM ఏం నిర్ణయం తీసుకుంటారో.

News February 13, 2025

మిగిలిన వారికి త్వరలో రైతు భరోసా: తుమ్మల

image

TG: జనవరి 26 నుంచి రైతు భరోసా పథకం కింద మూడు విడతలుగా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకు రూ.3,487.82 కోట్లను జమ చేసినట్లు వివరించారు. మిగిలిన వారికీ త్వరలోనే నిధులు జమ చేస్తామని వెల్లడించారు. రైతు భరోసా సాయాన్ని వ్యవసాయ పెట్టుబడుల కోసమే వినియోగించాలని ఆయన సూచించారు.

News February 13, 2025

‘అమ్మా.. నాన్నా.. క్షమించండి’

image

రెండు రోజుల కింద విడుదలైన JEE మెయిన్స్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని 12వ తరగతి విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. యూపీలోని గోరఖ్‌పూర్‌ హాస్టల్‌లో ఉంటున్న 18 ఏళ్ల అమ్మాయి హాస్టల్ గదిలో ఉరేసుకొని చనిపోయింది. పోలీసులు సంఘటనా స్థలం వద్ద సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘మమ్మీ, పాపా నన్ను క్షమించండి. మీరు నన్ను ఎంతో ప్రేమించారు కానీ మీ ఆశలను నెరవేర్చలేపోయాను’ అని ఆమె అందులో రాసింది.

error: Content is protected !!