News February 12, 2025

రేపు గ్రూప్-2 హాల్‌టికెట్లు విడుదల

image

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల హాల్‌టికెట్లను రేపు విడుదల చేయనున్నట్లు APPSC తెలిపింది. ఫిబ్రవరి 23వ తేదీన ఉదయం, మధ్యాహ్నం రెండు పేపర్లకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి 13 జిల్లా కేంద్రాల్లో ఎగ్జామ్ సెంటర్లు ఉంటాయి. అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకుని, అందులోని సూచనలను గమనించాలని APPSC తెలిపింది. ఒకరోజు ముందుగానే కేటాయించిన పరీక్షా కేంద్రాన్ని చూసుకోవాలని సూచించింది.

Similar News

News February 12, 2025

స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్?

image

TG: 42% బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చాకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలిపి కేంద్రానికి పంపుతామని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే కేంద్రం ఆమోదం తెలుపుతుందా? లేదా? తెలిపినా ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో మార్చి తర్వాతే స్థానిక ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది.

News February 12, 2025

‘దిల్‌రూబా’ విడుదల వాయిదా

image

కిరణ్ అబ్బవరం నటించిన ‘దిల్‌రూబా’ విడుదల వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ వాలంటైన్స్ డే సందర్భంగా FEB 14న రిలీజ్ కావాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని కిరణ్ తెలియజేస్తూ ‘కొంచెం లేట్‌గా వస్తున్నాం’ అని ట్వీట్ చేశారు. త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని చెప్పారు. కిరణ్ నటించిన ‘క’ హిట్ కావడంతో ఈ మూవీపైనా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

News February 12, 2025

పోలీసులకు పృథ్వీ ఫిర్యాదు

image

YCP సోషల్ మీడియా వింగ్ తనను వేధిస్తోందని HYD సైబర్‌క్రైమ్ పోలీసులకు నటుడు పృథ్వీ రాజ్ ఫిర్యాదు చేశారు. లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన <<15435022>>వ్యాఖ్యల <<>>తర్వాత ఫోన్లు, మెసేజ్‌లతో ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. తన ఫోన్ నంబర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని, 1800 కాల్స్ చేయించారని వివరించారు. తనను వేధించిన వారిపై రూ.కోటి పరువునష్టం దావా వేస్తానని, AP హోంమంత్రికీ ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు.

error: Content is protected !!