News January 17, 2025
రేపు గ్రూప్-2 ‘కీ’ విడుదల
TG: గ్రూప్-2 ‘కీ’ రేపటి నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో వస్తుందని టీజీపీఎస్సీ పేర్కొంది. ఈనెల 18 నుంచి 22న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్లైన్లో తమ అభ్యంతరాలను తెలపొచ్చని వెల్లడించింది. కాగా డిసెంబర్ 15, 16న గ్రూప్-2 పరీక్ష జరిగింది.
Similar News
News January 18, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి
News January 18, 2025
రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు మృతి
ముంబైలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీవీ నటుడు అమన్ జైస్వాల్(23) మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న బైక్ను ట్రక్ ఢీకొనడంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రగాయాలైన అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ చనిపోయినట్లు పేర్కొన్నారు. ట్రక్కు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అమన్ ‘ధర్తీపుత్ర్ నందిని’ అనే సీరియల్లో లీడ్ రోల్లో నటించారు.
News January 18, 2025
నిరాశపరిచిన సింధు
ఇండియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో ఇండోనేషియా ప్లేయర్ గ్రెగోరియా మారస్కా 9-21, 21-19, 17-21 పాయింట్ల తేడాతో సింధును ఓడించారు. తొలి రౌండ్లో పూర్తిగా తేలిపోయిన ఈ తెలుగు షట్లర్ రెండో రౌండ్లో పుంజుకున్నట్లు కనిపించినా మూడో రౌండ్లో నిరాశపరిచారు. మరోవైపు మెన్స్ డబుల్స్ జోడీ రంకి రెడ్డి, చిరాగ్ శెట్టి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.