News November 10, 2024
గ్రూప్-2 మెయిన్స్ వాయిదా.. FEB 23న పరీక్ష?

AP: రాష్ట్రంలో గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ ప్రకారం జనవరి 5న <<14491669>>జరగాల్సి<<>> ఉండగా అభ్యర్థుల వినతి మేరకు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 23న ఈ పరీక్ష నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా పడటంతోపాటు మెయిన్స్‌కు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాక అధికారులు కొత్త తేదీపై అధికారిక ప్రకటన చేయనున్నారు.
Similar News
News November 27, 2025
హీరోయిన్ కూడా మారారా!

‘బలగం’ ఫేమ్ వేణు తెరకెక్కించనున్న ఎల్లమ్మపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో కీర్తీ సురేశ్ నటిస్తున్నారని ప్రచారం జరగ్గా, ఆ వార్తలను ఆమె తాజాగా కొట్టిపడేశారు. దీంతో ఇన్నాళ్లు ఈ మూవీ హీరోల పేర్లే మారాయని, ఇప్పుడు హీరోయిన్ కూడా ఛేంజ్ అయ్యారా? అని సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈ సినిమాలో హీరోగా చేస్తారని నితిన్, నాని, బెల్లంకొండ సాయి, శర్వానంద్ పేర్లు వినిపించి DSP దగ్గర ఆగిన విషయం తెలిసిందే.
News November 27, 2025
స్వెటర్లు ధరిస్తున్నారా?

చలికాలంలో స్వెటర్లు వాడటం కామన్. అయితే వాటి శుభ్రతపై నిర్లక్ష్యం వద్దంటున్నారు వైద్యులు. ప్రతి 5-7సార్లు ధరించిన తర్వాత ఉతకాలని సూచిస్తున్నారు. వాటి క్వాలిటీ, ఎంతసేపు ధరించాం, లోపల ఎటువంటి దుస్తులు వేసుకున్నాం, శరీర తత్వాలను బట్టి ఇది ఆధారపడి ఉంటుందట. స్వెటర్ లోపల కచ్చితంగా దుస్తులు ఉండాలని, శరీరం నుంచి తొలగించిన తర్వాత గాలికి ఆరబెట్టాలని.. లేకపోతే చర్మవ్యాధులకు ఆస్కారముందని హెచ్చరిస్తున్నారు.
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: చంద్రబాబు

AP: పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకూడదని, 2 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.


