News March 17, 2024
గ్రూప్-2 ప్రిలిమ్స్.. 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక

AP: గత నెల 25న 897 గ్రూప్-2 ఉద్యోగాలకు జరిగిన ప్రిలిమినరీ పరీక్షపై APPSC కీలక నిర్ణయం తీసుకుంది. మెయిన్స్ కోసం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు కమిషన్ సభ్యుడు పరిగె సుధీర్ వెల్లడించారు. వచ్చే వారం అధికారిక ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా ప్రిలిమ్స్ కఠినంగా వచ్చినందున 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News December 1, 2025
NGKL: సోషల్ మీడియా పోస్టులపై పోలీసుల నిఘా

గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటన, ఎదుటివారిని కించపరిచే విధంగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ హెచ్చరించారు. రెండు పార్టీల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
News December 1, 2025
క్యారెట్ సాగు – ముఖ్యమైన సూచనలు

క్యారెట్ శీతాకాలం పంట. దీన్ని ఆగస్టు-డిసెంబర్ మధ్యలో నాటుకోవచ్చు. నాణ్యమైన దిగుబడి రావాలంటే 18-24 డిగ్రీల సెల్సియన్ ఉష్ణోగ్రత అవసరం. క్యారెట్ సాగుకు మురుగునీటి వసతి గల లోతైన, సారవంతమైన గరప నేలలు అత్యంత అనుకూలం. బరువైన బంకనేలలు పనికిరావు. నేల ఉదజని సూచిక 6.5గా ఉంటే మంచిది. ఎకరాకు 2 కేజీల విత్తనాలు అవసరం. ప్రతి 15 రోజుల తేడాలో విత్తనాలు విత్తుకుంటే డిమాండ్కు అనుగుణంగా మంచి దిగుబడి సాధించవచ్చు.
News December 1, 2025
ఇకపై అన్ని ఫోన్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయలేం!

దేశంలో నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు మొబైల్ తయారీ సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలిచ్చినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. ఇకపై తయారయ్యే ఫోన్లలో తప్పనిసరిగా ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ యాప్ ‘సంచార్ సాథీ’ని డిఫాల్ట్గా ఇవ్వాలని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ యాప్ను డిలీట్ చేయలేరు. ఇందుకు 90 రోజుల గడువు ఇచ్చినట్లు పేర్కొంది. ఈ అంశంపై అటు ప్రభుత్వం, ఇటు మొబైల్ కంపెనీలు అధికారికంగా స్పందించలేదు.


