News September 12, 2025

రేపు గ్రూప్-2 మూడో విడత సర్టిఫికెట్ వెరిఫికేషన్

image

TG: 783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ మూడో విడత తేదీలను TGPSC ప్రకటించింది. రేపు ఉదయం 10.30 గంటల నుంచి HYD నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీలో ప్రారంభమవుతుందని తెలిపింది. అభ్యర్థులు హాజరయ్యాక ఇంకా ఏవైనా పత్రాలు పెండింగ్‌లో ఉంటే ఈనెల 15న సమర్పించొచ్చని పేర్కొంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను https://www.tgpsc.gov.inలో చూడొచ్చు.

Similar News

News February 2, 2026

ఈ FEB అరుదైన నెల అంటూ ప్రచారం.. నిజమెంత?

image

2026 ఫిబ్రవరి 823 ఏళ్లకోసారి వచ్చే అరుదైన నెల అంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా 4 సార్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రచారం అవాస్తవం. నిజానికి లీప్ ఇయర్ కాని ప్రతి ఏటా FEBలో 28 రోజులే ఉంటాయి. అంటే ప్రతి వారం కచ్చితంగా 4 సార్లే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆదివారంతో మొదలవడంతో క్యాలెండర్‌లో తేదీలు క్రమ పద్ధతిలో కనిపిస్తున్నాయి. గతంలో 2015లో ఇలాగే జరగగా, 2037లోనూ రానుంది.

News February 2, 2026

ఎయిరిండియా విమానంలో ‘ఫ్యూయల్ స్విచ్’ సమస్య!

image

లండన్-బెంగళూరు ఎయిరిండియా విమానంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బోయింగ్ 787-8 విమానాన్ని గ్రౌండ్ చేశారు. విమాన తయారీ సంస్థ (OEM)తో చెకింగ్ చేయిస్తున్నారు. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA దృష్టికీ తీసుకెళ్లారు. గత ఏడాది 260 మంది మృతికి కారణమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఫ్యూయల్ స్విచ్ సమస్యల వల్లే జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

News February 2, 2026

గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్: విదేశాల నుంచి తెచ్చే నగలపై లిమిట్ పెంపు

image

నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ‘బ్యాగేజ్ రూల్స్ 2026’ ప్రకారం ఏడాదికి పైగా విదేశాల్లో ఉన్న మహిళా ప్రయాణికులు 40g వరకు, పురుషులు 20g వరకు గోల్డ్ జువెలరీని ఎటువంటి పన్ను లేకుండా తీసుకురావచ్చు. సాధారణ వస్తువుల డ్యూటీ-ఫ్రీ లిమిట్‌ను ₹50,000 నుంచి ₹75,000కు పెంచారు. ఒక కొత్త ల్యాప్‌టాప్‌ తెచ్చుకోవడానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. విదేశీ పర్యాటకుల లిమిట్‌ కూడా ₹25,000కు పెరిగింది.