News November 17, 2024

GROUP-3 EXAM: HYDలో‌ సెంటర్ల వివరాలు

image

గ్రూప్-3 పరీక్షకు అంతా సిద్ధమైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మన మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో 115 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ 65,361మంది అభ్యర్థులు పరీక్ష హాజరుకావాల్సి ఉంది. రంగారెడ్డిలో 103 పరీక్ష కేంద్రాల్లో 56,394 మంది, హైదరాబాద్‌లో 102 కేంద్రాల్లో 45,918 మంది పరీక్ష రాయనున్నారు. మూడు జిల్లాల్లోనే ఏకంగా 1,67,673 మంది పోటీలో ఉండటం విశేషం. 10 AMకు పరీక్ష. గంట ముందే చేరుకోండి.
ALL THE BEST

Similar News

News December 26, 2025

గ్రేటర్ నయా రూపం ఇదే!

image

GHMC తాజా అధికారిక మ్యాప్ చూస్తుంటే సీన్ అర్థమవుతోంది. పాత వార్డుల లెక్కలకు చెల్లుచీటి రాస్తూ సరిహద్దుల పునర్విభజనతో సిటీ మ్యాప్ కొత్తగా మెరుస్తోంది. జనాభా పెరిగిన చోట వార్డులను ముక్కలు చేసి, పరిపాలన గల్లీ స్థాయికి చేరేలా స్కెచ్ వేశారు. శేరిలింగంపల్లి నుంచి ఉప్పల్, కుత్బుల్లాపూర్ నుంచి రాజేంద్రనగర్ వరకు పెరిగిన కాలనీలన్నీ ఇప్పుడు సరికొత్త సర్కిళ్లలోకి చేరాయి. మ్యాప్‌లో జోన్‌ల సరిహద్దులు మారాయి.

News December 26, 2025

HYDలో తొలిసారిగా రిమోట్ కంట్రోల్డ్ రూఫ్!

image

పాతబస్తీలోని అలావా-ఏ-బీబీ వద్ద దేశంలోనే అరుదైన, సిటీలో మొట్టమొదటి ‘రిమోట్ కంట్రోల్డ్ రిట్రాక్టబుల్ రూఫ్’ రాబోతోంది. సుమారు రూ.1.20 కోట్లతో GHMC ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనుంది. మొహర్రం వేడుకలప్పుడు ఎండ, వానల వల్ల భక్తులు పడే ఇబ్బందులకు ఇక చెక్ పడనుంది. ఒకే ఒక్క రిమోట్ బటన్‌తో 4,844 చదరపు అడుగుల భారీ పైకప్పు క్షణాల్లో తెరుచుకుంటుంది లేదా మూసుకుంటుంది. సిటీలో ఇలాంటి ప్రయోగం జరగడం ఇదే తొలిసారి.

News December 26, 2025

HYD: బల్దియా ‘వసూళ్ల’ వేట.. సామాన్యుడికి వాత!

image

నగరవాసులపై పన్నుల భారాన్ని మోపేందుకు GHMC సిద్ధమైంది. డీలిమిటేషన్‌ సాకుతో ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా అధికారులు వసూళ్ల వేట ప్రారంభించారు. పాత, కొత్త సర్కిళ్లలో కలిపి రోజువారీగా రూ.7కోట్ల మేర పన్నులు రాబట్టాలని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెలకు సుమారు రూ.210కోట్లు ప్రజల నుంచి వసూలు చేయనున్నారు. మౌలిక వసతుల కల్పనను గాలికొదిలేసి, కేవలం పన్నుల వసూళ్లపైనే ప్రతాపం చూపడంపై ప్రజలు మండిపడుతున్నారు.