News November 18, 2024
గ్రూప్-3: సగం మంది పరీక్షలు రాయలేదు!
TG: గ్రూప్-3 పరీక్షలు నేటితో ముగిశాయి. మూడు పేపర్లకు కలిపి 50% మందే హాజరయ్యారు. నిన్న నిర్వహించిన పేపర్-1కు 51.1%, పేపర్-2కు 50.7%, నేడు నిర్వహించిన పేపర్-3కి 50.24% హాజరైనట్లు TGPSC తెలిపింది. ఈ గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా 1363 పోస్టులను భర్తీ చేయనున్నారు.
Similar News
News November 18, 2024
ఢిల్లీలో 12వ తరగతి వరకు ప్రత్యక్ష క్లాసులు బంద్
దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య తీవ్రత మరింత పెరగడంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10, 12వ తరగతులకు ఫిజికల్ క్లాసెస్ నిలిపివేస్తున్నామని, ఇక నుంచి ఆన్లైన్ క్లాసులు ఉంటాయని సీఎం అతిశీ వెల్లడించారు. ఇప్పటికే 9వ తరగతి వరకు క్లాసులను నిలిపివేశారు. గత 24 గంటల్లో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 493గా రికార్డయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్ప గాలి నాణ్యత అని అధికారులు చెప్పారు.
News November 18, 2024
మా నాన్న బెల్టు, చెప్పులతో కొట్టేవారు: ఆయుష్మాన్
తన బాల్యం బాధాకరంగా ఉండేదని బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా వెల్లడించారు. తండ్రి నియంతలా ఉండేవారని, తనను చెప్పులు, బెల్టులతో కొట్టేవారని తెలిపారు. ఓసారి తాను సిగరెట్ తాగకపోయినా షర్ట్ ఆ స్మెల్ రావడంతో విపరీతంగా కొట్టారని చెప్పారు. ఓ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ ‘నేను, భార్య తహీరా ట్వంటీస్లోనే పేరెంట్స్ అయ్యాం. నా తండ్రితో పోలిస్తే నేను భిన్నమైన ఫాదర్ను. ఫ్రెండ్లీగా ఉంటా’ అని పేర్కొన్నారు.
News November 18, 2024
BJP రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నా: అర్వింద్
TG: తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఉన్నట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని పాతబస్తీ నుంచే మొదలుపెట్టాలని, కాంగ్రెస్ బుల్డోజర్లకు అక్కడికి వెళ్లే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRది మేకపోతు గాంభీర్యమని, ఆయన అరెస్టుకు గవర్నర్ అనుమతి అవసరమా అని నిలదీశారు. లగచర్లలో కలెక్టర్పై దాడి కల్వకుంట్ల కుటుంబం పనే అని ఆరోపించారు.