News March 14, 2025

నేడు గ్రూప్-3 ఫలితాలు

image

TG: నేడు గ్రూప్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. జనరల్ ర్యాంకింగ్ లిస్టును టీజీపీఎస్సీ రిలీజ్ చేయనుంది. గత ఏడాది నవంబర్ 17, 18న నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలకు 2,69,483 మంది హాజరయ్యారు. దాదాపు 49.76 శాతం అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గ్రూప్-1, 2 ఫలితాలను TGPSC ప్రకటించింది.

Similar News

News December 7, 2025

నేడు కడప జిల్లాకు తెలంగాణ డిప్యూటీ CM.!

image

తెలంగాణ డిప్యూటీ CM బట్టి విక్రమార్కతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పోట్లదుర్తికి రానున్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ నాయుడు ఇటీవలే మాతృవియోగం అవడంతో ఆయనను పరామర్శించేందుకు హైదరాబాదు నుంచి వారు పొట్లదుర్తి చెరుకుని అనంతరం అక్కడ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లనున్నారు.

News December 7, 2025

ఆ లంబాడీలు ఎస్టీలు కాదు: హైకోర్టు

image

TG: 1956 తర్వాత మహారాష్ట్ర నుంచి వలస వచ్చి తెలంగాణలో స్థిరపడ్డ లంబాడీలు ఎస్టీ క్యాటగిరీ కిందకు రాబోరని హైకోర్టు స్పష్టం చేసింది. తమ ఎస్టీ సర్టిఫికెట్‌ను రద్దు చేశారని ఆదిలాబాద్ జిల్లాకు చెందిన హాన్ దేవానంద్ కుటుంబం హైకోర్టుకు వెళ్లింది. 1950 నాటికి తెలంగాణలో నివసించే లంబాడీలు, వారి పూర్వీకులు, మహారాష్ట్ర నుంచి వచ్చిన లంబాడీలకు మాత్రమే ఎస్టీ క్యాటగిరీ వర్తిస్తుందని కోర్టు స్పష్టం చేసింది.

News December 7, 2025

20 ఏళ్లు దాటిన తర్వాత మహిళలు ఈ టెస్టులు చేయించుకోవాలి

image

20 ఏళ్ల తర్వాత మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. అందుకే మహిళలు 20 ఏళ్ల తర్వాత కొన్ని పరీక్షలు తప్పకుండా చేయించుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు నిపుణులు. HPV టెస్ట్, STD టెస్ట్​, షుగర్, బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం. అలాగే ఎప్పటికప్పుడు నెలసరిని వస్తుందా.. లేదా.. ఏవైనా హార్మోన్ సమస్యలున్నాయా అన్నవీ చెక్ చేసుకోవాలి. వీటితో పాటు హెల్తీ పుడ్, వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు.