News July 4, 2024

1:50 నిష్పత్తిలోనే గ్రూప్1 మెయిన్స్: TGPSC

image

TG: గ్రూప్1 మెయిన్స్‌ పరీక్షకు 1:50 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక ఉంటుందని TGPSC స్పష్టం చేసింది. 1:100 నిష్పత్తి సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కాగా 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని కొందరు అభ్యర్థులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. ఆ అభ్యర్థనలను పరిశీలించాలని TGPSCకి కోర్టు సూచించింది. సాధారణ పరిపాలనశాఖ జారీ చేసిన GO.55లోని నిబంధనల ప్రకారం ఆ అభ్యర్థనను తిరస్కరిస్తున్నట్లు TGPSC స్పష్టం చేసింది.

Similar News

News March 11, 2026

‘కరోనా’కు ఆరేళ్లు

image

ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేసిన కరోనాను WHO ‘మహమ్మారి’గా ప్రకటించి నేటికి ఆరేళ్లు. చైనాలో మొదలైన ఈ వైరస్ అతి తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా విస్తరించి లక్షలాది మంది ప్రాణాలను బలిగొంది. వైద్యులు, శాస్త్రవేత్తల కృషితో వచ్చిన టీకాలు వైరస్ కట్టడికి దోహదపడ్డాయి. రోజులు గడిచిపోతున్నా ఆనాటి చేదు జ్ఞాపకాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మీ కామెంట్?

News March 11, 2026

ఫిరాయింపు MLA కేసులో క్లీన్ చిట్.. KTR ఫైర్

image

TG: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి పార్టీ ఫిరాయింపు కేసులో స్పీకర్ <<19352106>>క్లీన్ చిట్<<>> ఇవ్వడం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. ‘కాంగ్రెస్ బీఫామ్‌పై MPగా పోటీ చేసిన వారికే క్లీన్ చిట్ ఇవ్వడం ప్రజల తీర్పును అవమానించడమే. అధికార పార్టీ కోసం రాజ్యాంగ వ్యవస్థలను వాడుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు’ అని KTR హెచ్చరించారు.

News March 11, 2026

అంగీకారంతో జరిగితే దాన్ని రేప్ అనలేం: కర్ణాటక హైకోర్టు

image

అంగీకారంతో కొన్నేళ్లపాటు రిలేషన్‌షిప్‌లో ఉండి ఆపై పెళ్లికి నిరాకరిస్తే రేప్‌గా పరిగణించలేమని కర్ణాటక HC స్పష్టం చేసింది. ‘‘చట్టం ప్రకారం ‘హార్ట్‌బ్రేక్’ నేరం కాదు’’ అని కోర్టు వ్యాఖ్యానించింది. పైగా విదేశాల్లో ఫిజికల్ రిలేషన్ పెట్టుకుంటే అది మోసం కిందకు రాదంటూ నిందితుడిపై కేసును కొట్టివేసింది. కేవలం పెళ్లి చేసుకోలేదన్న కారణంతో అంగీకారంతో కూడిన బంధాన్ని రేప్‌గా మార్చలేమని కోర్టు తేల్చిచెప్పింది.