News November 26, 2024

పెరుగుతున్న చలి.. 3 రోజులు జాగ్రత్త!

image

TG: రాష్ట్రంలో రాబోయే 3 రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత మరీ ఎక్కువగా ఉందని తెలిపింది. నిన్న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్‌లో 8.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చాలా చోట్ల 10 డిగ్రీలు, HYD శివారులోని పటాన్ చెరు ప్రాంతంలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Similar News

News November 22, 2025

ఇనుప తీగల ఉచ్చుతో ఎలుకల నియంత్రణ

image

ఎలుకల నివారణకు ఈ పద్ధతి చక్కగా ఉపయోగపడుతుంది. ఇనుప తీగలు, వెదురు, తాటాకులతో తయారు చేసిన బుట్టలను ఎకరానికి 20 వరకు ఏర్పాటు చేయాలి. ఎలుకలను ఆకర్షించడానికి వాటిలో ఉల్లిపాయలు, టమాట, ఎండుచేపలు, బజ్జీలు లాంటివి ఉంచాలి. వీటిని పొలం గట్ల వెంబడి, గోదాముల్లో ఏర్పాటు చేసుకోవచ్చు. వరిలో నారుమడి పోసిన దగ్గర నుంచి దమ్ములు పూర్తై నాట్లు వేసిన నెల వరకు.. కోతల తర్వాత ఏర్పాటు చేస్తే ఎలుకలను సమర్థంగా నివారించవచ్చు.

News November 22, 2025

కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ ప్రారంభించాలి: DYFI

image

AP: కానిస్టేబుల్ ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా శిక్షణ ప్రారంభించకపోవడంపై DYFI మండిపడింది. దీనివల్ల అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపింది. 6,100 మందికి వెంటనే ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇవ్వాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది. ఈ పోస్టులకు 2022లో నోటిఫికేషన్ వెలువడగా లీగల్ సమస్యలతో ప్రక్రియ ఆలస్యమైంది. ఈ ఏడాది జూన్‌లో మెయిన్స్ నిర్వహించి AUGలో రిజల్ట్స్ ప్రకటించారు.

News November 22, 2025

విద్యార్థినుల కోసం కొత్త పథకం: మంత్రి లోకేశ్

image

AP: వచ్చే ఏడాది నుంచి ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని అమలు చేస్తామని మంత్రి లోకేశ్ తెలిపారు. దీనిపై విధివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ‘దేశవిదేశాల్లో ఉన్నత విద్య చదవాలనే విద్యార్థినులకు ఆర్థిక సాయం అందిస్తాం. ప్రస్తుతం విదేశాల్లో APకి చెందిన 27,112 మంది, స్వదేశంలో 88,196 మంది విద్యార్థినులు ఉన్నత చదువులు చదువుతున్నారు’ అని ట్వీట్ చేశారు.