News November 2, 2024
డిజిటల్ యాడ్స్కు పెరుగుతున్న క్రేజ్.. Google India ఆదాయం వృద్ధి

దేశంలో డిజిటల్ ప్రకటనలకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్లైన్ ద్వారా తమ వస్తువులు, ఉత్పత్తుల ప్రచారానికి వ్యాపారులు పెద్దపీట వేస్తున్నారు. Google India ఆదాయం FY24లో గత ఏడాదితో పోల్చితే 26% పెరిగి రూ.5,921 కోట్లుగా నమోదవ్వడమే అందుకు నిదర్శనం. భారత్లో డిజిటల్ అడాప్షన్ పెరగడంతో ప్రకటనల్లో వృద్ధి, ఎంటర్ప్రైజ్ ఉత్పత్తుల విక్రయాలు ఈ పెరుగుదలకు కారణమని సంస్థ తెలిపింది.
Similar News
News November 26, 2025
ప్రీ డయాబెటీస్ని ఎలా గుర్తించాలంటే?

ప్రీ డయాబెటిస్ అంటే డయాబెటిస్ రావడానికి ముందు స్టేజి. వీరిలో రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సినదాని కన్నా కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ స్టేజిలో జాగ్రత్తలు తీసుకోకపోతే డయాబెటిస్ స్టేజిలోకి వెళ్తారు. వీరికి మందులు ఇవ్వకుండా ముందు డైట్ పాటించాలని, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తారు. ప్రీ డయాబెటీస్ ఉన్న కొందరికి షుగర్ లక్షణాలుంటాయి. కానీ 35 ఏళ్లు దాటాక అందరూ షుగర్ టెస్టులు చేయించుకోవడం మంచిది.
News November 26, 2025
బెండ, టమాటా, వంగలో వైరస్ తెగుళ్ల నివారణ

కూరగాయ పంటల్లో వైరస్ తెగుళ్ల వ్యాప్తిని అరికట్టేందుకు రసం పీల్చే పురుగులను నివారించాలి. ఇందుకోసం ఫాసలోన్ లేదా ఫిప్రోనిల్ మందులను లీటరు నీటికి 2ML చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్ల దోమ నివారణకు 1.5గ్రా. ఎసిఫేట్ను లీటరు నీటికి కలిపి, కాయతొలుచు పురుగు నివారణకు 2ML ప్రొఫెనోఫాస్ లీటరు నీటికి కలిపి స్ప్రే చేయాలి. అలాగే అధికారుల సిఫారసు మేరకు నత్రజని ఎరువులను వేసుకుని నీరు పెట్టుకోవాలి.
News November 26, 2025
భారత్ చెత్త రికార్డు

సౌతాఫ్రికాతో రెండో టెస్టులో 408 పరుగుల తేడాతో ఓడిన టీమ్ ఇండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. టెస్టు క్రికెట్లో రన్స్ పరంగా భారత్కు ఇదే అతిపెద్ద పరాజయం. 2004లో 342(vsAUS), 2006లో 341(vsPAK), 2007లో 337(vsAUS), 2017లో 333(vsAUS) పరుగుల తేడాతో IND ఓడిపోయింది. తాజా ఓటమితో WTC 2025-27 సీజన్లో భారత్ ఐదో స్థానానికి పడిపోయింది. తొలి 4 స్థానాల్లో ఆసీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాక్ ఉన్నాయి.


