News November 16, 2024

నయన్‌కు పెరుగుతున్న సపోర్ట్

image

తమిళ హీరో ధనుష్‌ తనకు <<14626837>>లీగల్<<>> నోటీసులు పంపడంపై హీరోయిన్ నయనతార చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరలవుతోంది. ఆమె చేసిన పోస్ట్‌పై ఇండస్ట్రీకి చెందిన కొందరు నటీమణులు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రియా, అంజు కురియన్, ఐశ్వర్య లక్ష్మి, నజ్రియా, గౌరి జీ కిషన్ ఆమె పోస్ట్‌ను లైక్ చేశారు. నటి పార్వతి ఆ పోస్ట్‌ను తన ఇన్‌స్టా స్టోరీగా షేర్ చేశారు. కాగా, ఇందులో కొందరు ధనుష్‌తో నటించినవారున్నారు.

Similar News

News January 13, 2026

పేపర్ లీక్.. అశ్వారావుపేటలో ముగ్గురు ఏఈఓల సస్పెండ్

image

అగ్రికల్చర్ బీఎస్సీ పరీక్షల్లో పేపర్ లీకేజీకి పాల్పడి దొరికిపోయిన 30 మంది ఇన్ సర్వీస్ ఏఈఓలను యూనివర్సిటీ అధికారులు సస్పెండ్ చేశారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ ద్వారా షేర్ చేసి లీకేజీకి కారణమైన 30 మందితోపాటు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఇందులో అశ్వారావుపేటలో ముగ్గురిపై ప్రభుత్వం వేటు వేసింది.

News January 13, 2026

రూ.5,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,42,530కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,30,650 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.5,000 పెరిగి రూ.2,92,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలుంటాయి.

News January 13, 2026

మన ఊరు దగ్గరవుతున్న కొద్దీ ఆ ఫీలింగే వేరు!

image

సంక్రాంతికి పట్టణాలన్నీ ఖాళీ అవుతుండగా పల్లెలు సందడిగా మారాయి. ఇప్పటికే కొందరు సొంతూళ్లకు చేరుకోగా, మరికొందరు ప్రయాణాల్లో ఉన్నారు. అయితే మన ఊరు కొద్ది దూరంలో ఉందనగా కలిగే అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని పలువురు SMలో పోస్టులు పెడుతున్నారు. పేరెంట్స్, ఫ్రెండ్స్, స్కూల్, చెరువు, పొలాలు తదితరాలు గుర్తుకొస్తాయి. పండగకి ఊరెళ్లేటప్పుడు ఎంత సంతోషంగా ఉంటామో.. తిరిగొచ్చేటప్పుడు అంతే బాధగా అన్పిస్తుంది కదా?