News August 6, 2024
రాష్ట్రంలో ఐటీ ఉద్యోగాల వృద్ధి తగ్గింది: కేటీఆర్

TG: 2022-23లో 1,27,594 ఐటీ ఉద్యోగాలు సృష్టించగా, 2023-24లో ఆ సంఖ్య 40,285కు పడిపోయిందని కేటీఆర్ తెలిపారు. ఇదే టైమ్లో ఐటీ ఎగుమతుల విలువ ₹57,706cr నుంచి ₹26,948crకు పడిపోయిందని ట్వీట్ చేశారు. BRS హయాంలో ఐటీ సెక్టార్ మెరుగైన వృద్ధిని సాధించిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ట్వీట్ చేశారు.
Similar News
News December 27, 2025
టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి నాకంటే ముందున్నారు: చంద్రబాబు

NTR ట్రస్టు, విద్యాసంస్థలను నారా భువనేశ్వరి సమర్థవంతంగా నడిపిస్తున్నారని CM CBN ప్రశంసించారు. HYDలో జరిగిన NTR ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. టెక్నాలజీ విషయంలో భువనేశ్వరి తన కంటే ముందున్నారని, తాను పేపర్ చూసి స్పీచ్ ఇస్తుంటే ఆమె ట్యాబ్ చూసి మాట్లాడుతున్నారని చమత్కరించారు. ఇక చిన్నప్పుడు తనను చాలామంది IAS చదవమన్నా తాను రాజకీయాల్లోకి రావాలని డిసైడ్ అయ్యాయని చెప్పారు.
News December 27, 2025
తప్పు ఒప్పుకున్న శివాజీ

నటుడు <<18646239>>శివాజీ<<>> క్షమాపణలు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ విచారణలో ఆయన తన తప్పును అంగీకరించారని, కమిషన్ ఛైర్పర్సన్ శారద అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకపోయారని పేర్కొంది. ఇక మీదట మహిళల విషయంలో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తానని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. మహిళలను సమ దృష్టిలో చూడాలని, ఇతరుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయరాదని శివాజీకి సూచించినట్లు తెలిపింది.
News December 27, 2025
పుట్టిన రోజులకూ జంతు బలి.. ఏంటీ సంస్కృతి?

ఏపీలో ‘జంతు బలి’పై అధికార, విపక్షాల మధ్య <<18686511>>మాటల<<>> యుద్ధం కొనసాగుతోంది. మీవారే చేశారంటే.. మీవాళ్లూ చేశారంటూ TDP-YCP విమర్శలు చేసుకుంటున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో జంతుబలిపై నిషేధం ఉంది. అయినా పండగలు, జాతరల సందర్భంగా బలిస్తూనే ఉన్నారు. కానీ వ్యక్తుల పుట్టినరోజులకూ వాటిని బలివ్వడం ఆందోళనకు గురి చేస్తోందని జంతు ప్రేమికులు అంటున్నారు. వీటికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలను కోరుతున్నారు. మీరేమంటారు?


