News January 29, 2025
నేడు జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం

ఇస్రో తన 100వ ప్రయోగానికి సిద్ధమైంది. ఇవాళ ఉదయం 6.23 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్ 15 ప్రయోగం చేపట్టనుంది. దీని ద్వారా NVS-02 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపనుంది. 2,250 KGల బరువున్న ఈ శాటిలైట్‌ను 36,000 KM దూరంలో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనుంది. ఈ శాటిలైట్ దేశ నావిగేషన్ సిస్టం కోసం పనిచేయనుంది. సైనిక కార్యకలాపాలు, వ్యూహాత్మక అనువర్తనాలు, భౌగోళిక నావిగేషన్‌ను మెరుగుపరచనుంది.
Similar News
News January 30, 2026
KCRకు మరోసారి నోటీసులు!

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS అధినేత KCRకు ఇవాళ సిట్ <<18998286>>మరోసారి<<>> నోటీసులు ఇవ్వనుంది. రేపు విచారణకు రావాలని అందులో పేర్కొననున్నట్లు తెలుస్తోంది. అయితే నందినగర్‌లోని ఇంట్లో నోటీసులు ఇస్తారా? ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో అందిస్తారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిన్న నందినగర్ నివాసంలో సిట్ నోటీసులిచ్చి విచారణకు రావాలని కోరగా, KCR అభ్యర్థన మేరకు నేడు మినహాయింపు ఇచ్చారు.
News January 30, 2026
CSIR ఇన్నోవేషన్ కాంప్లెక్స్‌లో ఉద్యోగాలు

ముంబైలోని <
News January 30, 2026
థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరా?

సాధారణంగా థైరాక్సిన్ హార్మోన్ స్థాయులు తగ్గిపోవడం వల్ల ప్రొలాక్టిన్ హార్మోన్ స్థాయులు పెరిగిపోతాయి. దీంతో అండం సరిగా విడుదల కాకపోవడం వల్ల గర్భం ధరించడం కష్టమవుతుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సంతానలేమికి దారితీస్తాయి కాబట్టి సమస్యను గుర్తించి డాక్టర్ల పర్యవేక్షణలో సరైన చికిత్స తీసుకుంటే సంతానం పొందొచ్చు. అలాగే గర్భం ధరించిన తర్వాత కూడా డాక్టర్ల సలహా తీసుకొని చికిత్స/మందులను కొనసాగించాలి.


