News September 23, 2025
GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ సస్పెండ్ !

అమరావతి ప్రాంతం వరద్దల్లో మునిగిపోయిందని GST అసిస్టెంట్ కమిషనర్ సుభాష్ FB వ్యక్తిగత ఖాతాలో పోస్ట్ చేశారు. ఇదే మన డ్రోన్ కేపిటల్, క్వాంటంవాలీ, అతిపెద్ద రైల్వేస్టేషను, అతిపెద్ద విమానాశ్రయం కట్టే రాజధాని అంటూ సెటైర్లు విసిరారు. FB పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకున్న AP ప్రభుర్వం వివరణ కోరుతూ మెమో జారీ చేసింది. వివరణలో పోస్ట్ నా వ్యక్తిగతం అంటూ సుభాష్ సమాధానం ఇవ్వగా ప్రభుత్వం సస్పెండ్ చేసినట్లు సమాచారం.
Similar News
News September 23, 2025
విజయవాడ: ప్రసాద తయారీని పరిశీలించిన కలెక్టర్

విజయవాడలోని దుర్గగుడిలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ జి. లక్ష్మీశా మంగళవారం ప్రసాద తయారీ ప్రాంతాలను పరిశీలించారు. భక్తులకు పరిశుభ్రమైన, సురక్షితమైన ప్రసాదం అందించేందుకు నాణ్యత ప్రమాణాలను సమీక్షించారు. లడ్డూ ప్రసాదం తయారీలో నాణ్యత, శుభ్రత పాటించాలని ఆయన సిబ్బందికి సూచించారు.
News September 23, 2025
HYD: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి!

కొద్ది రోజులుగా HYDలో వాన యుద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పంజాగుట్టలోని NIMS వద్ద సోమవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపుల శబ్ధాలతో అంతా దద్దరిల్లిపోయింది. పిడుగులు పడుతున్నాయా? అని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఇటువంటి వాతావరణం నగరవాసులకు సవాల్‌గా మారుతోంది. వరదలో ప్రయాణం, గమ్యం చేరడం గగనమైంది. ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల్లో ఈ ఒక్క పూట వాన పడకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
News September 23, 2025
HYD: ఓ మేఘమా ఉరమకే ఈ పూటకి!

కొద్ది రోజులుగా HYDలో వాన యుద్ధం చేసినట్లు అనిపిస్తోంది. పంజాగుట్టలోని NIMS వద్ద సోమవారం వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపుల శబ్ధాలతో అంతా దద్దరిల్లిపోయింది. పిడుగులు పడుతున్నట్లు భయాందోళన మొదలైంది. ఇటువంటి వాతావరణం నగరవాసులకు సవాల్‌గా మారుతోంది. వరదలో ప్రయాణం, గమ్యం చేరడం గగనమైంది. ఉద్యోగుల కష్టాలు వర్ణణాతీతం. నగరవాసుల్లో ఈ ఒక్క పూట వాన పడకుంటే చాలు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.