News February 1, 2026
GST కలెక్షన్స్@ 1.93లక్షల కోట్లు

జనవరిలో జీఎస్‌టీ కలెక్షన్లు భారీగా నమోదయ్యాయి. గత ఏడాది జనవరితో పోలిస్తే ఈసారి 6.2% వృద్ధి నమోదైంది. మొత్తం గ్రాస్ కలెక్షన్స్ ఈసారి ₹1,93,384కోట్లు వసూలయ్యాయి. ఇక నెట్ రెవెన్యూ ₹1.70లక్షల కోట్లుగా ఉంది. దేశీయంగా మార్కెట్‌లో డిమాండ్ పెరగడం, ఇంపోర్ట్ రెవెన్యూ పెరగడం ఈ వసూళ్లకు కలిసొచ్చాయి. కాగా టోటల్ రిఫండ్స్ గతఏడాది జనవరితో పోలిస్తే 3.1% తగ్గి ₹22,665 కోట్లుగా నమోదైంది.
Similar News
News February 20, 2026
వయసు కంటే వ్యక్తి.. కులం కంటే క్యారెక్టర్: మారిన పెళ్లి ట్రెండ్!

ఇండియన్ మ్యారేజ్ సిస్టమ్‌లో పదేళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయి. ‘జీవన్ సాథీ’ ప్రకారం.. 2016-2025 మధ్య పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టే సగటు వయసు 27 నుంచి 29 ఏళ్లకు చేరింది. నేటి యువత ‘సరైన వయసు’ కంటే ‘సరైన వ్యక్తి’నే ప్రిఫర్ చేస్తున్నారు. గతంలో 91% మంది కులానికి ప్రాధాన్యం ఇస్తే.. ఇప్పుడు అది 54%కి పడిపోయింది. ‘డ్యూయల్ ఇన్‌కమ్’ సంస్కృతి పెరిగింది. ఆర్థిక భద్రత కంటే ఎమోషనల్ బాండింగ్‌కే ఓటేస్తున్నారు.
News February 20, 2026
పసుపు ఉడకబెట్టే సమయంలో జాగ్రత్తలు

పసుపు దుంపలను తవ్విన 2 నుంచి 3 రోజుల్లోపలే దుంపలను ఉడికించాలి. దీనివల్ల మంచి నాణ్యత ఉంటుంది. ఆలస్యమైతే నాణ్యత తగ్గుతుంది. పసుపు దుంపలు, కొమ్ములను వేరుగావేరుగా ఉడకబెట్టాలి. మరీ ఎక్కువ ఉడకబెడితే రంగు చెడిపోతుంది. తక్కువగా ఉడకబెడితే దుంపలు పెళుసుగా మారి మెరుగు పెట్టేటప్పుడు ముక్కలుగా విరిగిపోతాయి. స్టీమ్ బాయిలర్లలో తక్కువ సమయంలో ఎక్కువ పసుపును ఉడికించి, నాణ్యతతో కూడిన పసుపు పొందవచ్చు.
News February 20, 2026
GREAT: ఓటమి నుంచి ప్రపంచ రికార్డుల వరకు!

మిస్టర్ బీస్ట్ తన యూట్యూబ్ ప్రస్థానాన్ని ప్రారంభించి 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆయన యువతలో స్ఫూర్తి నింపే పోస్ట్ చేశారు. మొదట్లో ఎవరూ తన వీడియోలు చూడలేదని, అందరూ తనను హేళన చేస్తూ సమయం వృథా అని విమర్శించారని గుర్తుచేసుకున్నారు. అయినప్పటికీ పట్టుదలతో శ్రమించి 468M సబ్‌స్క్రైబర్లతో Mr Beast ప్రపంచంలోనే టాప్ యూట్యూబర్‌గా ఎదిగారు. ఇప్పటివరకు ఆ ఛానల్‌కు 11వేల కోట్ల వ్యూస్ రావడం విశేషం.


