News October 8, 2025

GST సవరణలతో పేదకు ఉపశమనం: కలెక్టర్

image

GST సవరణలతో పేదకు ఉపశమనం లభించిందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. బుధవారం చందోలు గ్రామంలో విద్యార్థులకు GST సంస్కరణలపై అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన GST నిబంధనలతో పేద, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులకు అవసరమైన నిత్యవసరాల ధరలు తగ్గాయని వివరించారు. అనంతరం విద్యార్థులకు ఉపన్యాస పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

Similar News

News October 8, 2025

మాకవరపాలెం: జగన్ పర్యటన.. భద్రతపై ఎస్పీ సమీక్ష

image

మాకవరపాలెం మెడికల్ కళాశాల ప్రాంతాన్ని ఎస్పీ తూహిన్ సిన్హా పరిశీలించారు. రేపు జరగనున్న మాజీ సీఎం జగన్ పర్యటనకు సంభందించిన భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. జగన్ మీడియా సమావేశంలో మాట్లాడే ప్రదేశంతో పాటు కళశాల ప్రాంగణాన్ని పరిశీలించిన ఎస్పీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

News October 8, 2025

అనకాపల్లి: ‘PGRS అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి’

image

మండల, డివిజన్ స్థాయిలో పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన అర్జీలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. వచ్చిన ప్రతి అర్జీకి రసీదు ఇవ్వాలన్నారు. బుధవారం అనకాపల్లి కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండల స్థాయి సమన్వయ కమిటీ ద్వారా సివిల్ తగాదాలను పరిష్కరించాలని సూచించారు. నీటితీరువా, కోర్టు కేసులు, స్మార్ట్ కార్డుల పంపిణీ వివరాలు తెలుసుకున్నారు.

News October 8, 2025

విజయవాడ: RTC పైసా వసూల్..!

image

దసరా సందర్భంగా విజయవాడ PNBSకు SEP 24 నుంచి OCT 6వ తేదీ వరకు ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా రూ.20.20 కోట్ల ఆదాయం వచ్చింది. దాదాపు 40 లక్షల మంది పండుగ రోజుల్లో రవాణా చేశారు. PNBS పరిధిలో మొత్తం 750 ప్రత్యేక బస్సులను నడిపారు. ఇక గత ఏడాది కేవలం 20 లక్షల మందే ట్రావెల్ చేయగా.. రూ.17 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది ఉచిత బస్సు పథకం వల్ల 50% ప్రయాణికులు సంఖ్య, 25% ఆదాయం పెరిగిందని RTC అధికారులు చెబుతున్నారు.