News September 24, 2025

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట: కలెక్టర్

image

GST 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు ఊరట కలుగుతుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. GST 2.0 వ్యవసాయం, పారిశ్రామిక, భవన నిర్మాణం, విద్యారంగం, వర్తక రంగాలకు ఎంతో ఊతమిస్తుందన్నారు. ప్రజలు వినియోగించే నిత్యావసరాలు, మెడిసిన్‌, వ్యసాయ పరికరాలు, భవన నిర్మాణ సామాగ్రి, ఆటోమొబైల్‌ రంగాల్లోని ఉత్పత్తులపై భారీగా జీఎస్టీ తగ్గిందన్నారు.

Similar News

News September 24, 2025

పెంచలకోన: ధాన్యలక్ష్మీ అలంకరణలో అమ్మవారు

image

పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కార్యక్రమంలో భాగంగా బుధవారం అమ్మవారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం అమ్మవారు ధాన్యలక్ష్మి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.

News September 24, 2025

నెల్లూరుకు రూ.13.50 కోట్లు: కలెక్టర్

image

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (NCAP)లో భాగంగా నెల్లూరుకు 2025-26 సంవత్సరానికి రు.13.50 కోట్లు మంజురైనట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో నిధుల వినియోగానికి సంబంధించి అమలు కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎండ్ టు ఎండ్ పేవింగ్, గ్రీనరీ డెవలప్‌మెంట్, మెకానికల్ రోడ్ స్వీపింగ్, దుమ్ము నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

News September 24, 2025

NLR: ఛైర్మన్‌గా పెళ్లకూరు బాధ్యతల స్వీకరణ

image

ఏపీ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి ఛైర్మన్‌గా టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వేపల్లి MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. చాలా ఏళ్ల నుంచి సోమిరెడ్డి అనుచరుడిగా శ్రీనివాసులు రెడ్డి కొనసాగుతున్నారు.