News January 2, 2025

GST: APలో 6 శాతం తగ్గుదల.. TGలో 10 శాతం పెరుగుదల

image

2024 డిసెంబర్‌లోనూ ఏపీలో <>జీఎస్టీ వసూళ్లు<<>> 6 శాతం మేర తగ్గాయి. 2023 DECలో రూ.3,545 కోట్లు వసూలవగా, ఈసారి రూ.3,315 కోట్లే నమోదైంది. గత నవంబర్‌లోనూ 10 శాతం మేర జీఎస్టీ వసూళ్లు తగ్గిన విషయం తెలిసిందే. ఇక తెలంగాణలో 10 శాతం వృద్ధి నమోదైంది. 2023 DECలో రూ.4,753 కోట్లు వసూలవగా, ఈసారి రూ.5,224 కోట్లు వచ్చింది.

Similar News

News January 4, 2025

బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించిన బన్నీ

image

TG: పుష్ప-2 హీరో అల్లుఅర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. జడ్జి ముందు రెగ్యులర్ బెయిల్ పూచీకత్తు పత్రాలు సమర్పించారు. వాటిపై సంతకాలు చేశారు. అనంతరం తన ఇంటికి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జు‌న్‌కు నాంపల్లి కోర్టు నిన్న రూ.50వేల చొప్పున 2 పూచీకత్తులతో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

News January 4, 2025

AI చాట్‌బాట్‌లతో ఈ వివరాలు చెప్పొద్దు/అడగొద్దు!

image

ChatGPT, AI చాట్ బాట్‌లతో వ్యక్తిగత వివరాలు షేర్ చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, పాస్‌వర్డ్‌లు, వ్యక్తిగత రహస్యాలు, ఫైనాన్సియల్ ఇన్ఫో వంటివి షేర్ చేయొద్దంటున్నారు. వీటి నుంచి మెడికల్ అడ్వైస్‌లు తీసుకుని పాటించవద్దని, అవి డాక్టర్లు కాదని అంటున్నారు. మీరు షేర్ చేసే లేదా అడిగే విషయాలు చాట్ బాట్స్ స్టోర్ చేస్తాయని, ఆ డేటా ఇతరులకు చేరే ప్రమాదమూ ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

News January 4, 2025

క్యాబినెట్ భేటీ తర్వాత రైతులకు తీపికబురు: పొంగులేటి

image

TG: మరికాసేపట్లో జరగబోయే క్యాబినెట్ భేటీ తర్వాత రైతులు తీపి కబురు వింటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 80 లక్షల మంది ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 30 లక్షల అప్లికేషన్లపై యాప్ ద్వారా సర్వే చేశాం. త్వరలోనే లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ చేపడతాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.