News May 1, 2024
GST ఆల్‌టైమ్ రికార్డు

వస్తుసేవల పన్ను (GST) వసూళ్లు సరికొత్త రికార్డును అందుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.2.10 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 12.4% అధికమని, ఇది ఆల్‌టైమ్ రికార్డు అని పేర్కొంది. ఈ వసూళ్లలో CGST రూ.43,846 కోట్లు, SGST రూ.53,538 కోట్లు, IGST రూ.99,623 కోట్లు, సెస్ రూ.13,260 కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.
Similar News
News March 3, 2026
ఫేస్ రికగ్నిషన్‌తోనే ఇకపై పథకాలు: CM

TG: అనర్హులకు పథకాలు చేరకుండా, ఒక్కరికే రెండుసార్లు లబ్ధి చేకూరకుండా ఇకపై ఫేస్ రికగ్నిషన్ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరగాలని CM రేవంత్ ఆదేశించారు. ప్రతి పథకానికీ దీన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ‘అర్హులకు కచ్చితంగా లబ్ధి జరగాలి. అదే సమయంలో అనర్హులు లబ్ధిపొందకూడదు. ఆసరా పింఛన్లలో ముఖ గుర్తింపు చేపట్టడంతో 3L మంది అనర్హులను తొలగించగలిగాం’ అని కలెక్టర్ల కాన్ఫరెన్సులో చెప్పారు.
News March 3, 2026
ప్రతి వ్యక్తికీ 55 లీటర్ల మంచి నీళ్లు!

AP: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికీ రోజుకు 55 లీటర్ల మంచి నీటిని అందించాలని అధికారులను CM చంద్రబాబు, DyCM పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇవాళ వీరిద్దరూ ఉండవల్లిలో 2 గంటలు <<19287163>>భేటీ అయ్యారు<<>>. జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టు, గ్రామీణాభివృద్ధిపై సమీక్షించారు. అటవీ శాఖ చేపట్టిన హనుమాన్ ప్రాజెక్ట్ వివరాలను CBNకు పవన్ తెలియజేశారు. స్థానిక ఎన్నికలు, TTD వివాదాలు, నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై చర్చించినట్లు సమాచారం.
News March 3, 2026
క్యాన్సర్‌తో 2023లో లక్ష మంది మృతి!

భారతదేశంలో రొమ్ము క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 1990 నుంచి 2023 మధ్య కాలంలో ఈ కేసులు 477%, మరణాలు 352% పెరిగాయని ‘లాన్సెట్’ నివేదిక తెలిపింది. 2023లోనే దేశంలో 2.03 లక్షల కేసులు, లక్ష మరణాలు సంభవించాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి ఈ కేసులు 35 లక్షలకు చేరుతాయని అంచనా. ఈ వ్యాధి పట్ల అవగాహన, ముందస్తు పరీక్షలు అత్యవసరమని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు హెచ్చరించారు.


