News August 2, 2024

విజయవాడ, HYDలో జీఎస్టీ అప్పిలేట్ బెంచ్‌లు

image

దేశంలోని 36 రాష్ట్రాలు/UTలలో 31 జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ బెంచ్‌లను ఏర్పాటు చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏపీలో విజయవాడ కేంద్రంగా బెంచ్, విశాఖలో సర్క్యూట్ బెంచ్ ఉండనుంది. తెలంగాణకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తారు. గోవా, మహారాష్ట్రకు 3, యూపీకి 3, గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్‌లకు రెండు చొప్పున, మిగిలిన రాష్ట్రాలకు ఒక్కో బెంచ్ ఉంటుంది.

Similar News

News November 21, 2025

OTTలోకి వచ్చేసిన ‘బైసన్’

image

చియాన్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ హీరోగా నటించిన ‘బైసన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్షన్ చేసిన ఈ చిత్రంలో అనుపమ, పశుపతి కీలక పాత్రలు పోషించారు. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో ధ్రువ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.

News November 21, 2025

హ్యాపీగా ఉండాలంటే ఈ ఫుడ్స్ తినండి

image

మనల్ని ఆనందంగా ఉంచే హార్మోన్ అయిన డోపమైన్ ఆహారంలోనూ దొరుకుతుందంటున్నారు నిపుణులు. ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. బెర్రీస్, అరటిపండ్లు, నట్స్, ఫ్యాటీ ఫిష్, ప్రోబయాటిక్స్, ఓట్స్, ఆకుకూరలు, గుడ్లు, అవకాడో వంటివి ఆహారంలో చేర్చుకోవడంవల్ల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. వీటి వల్ల మూడ్ బాగుండటమే కాకుండా మెంటల్ క్లారిటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గించి ఎమోషనల్‌ హెల్త్ బావుండేలా చూస్తాయంటున్నారు నిపుణులు.

News November 21, 2025

7337359375 నంబర్‌కు HI అని పంపితే..

image

AP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. ‘తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదుచేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది’ అని చెప్పారు.