News September 1, 2024

ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

image

గతేడాది ఆగస్టులో ₹1.59 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదవగా, ఈ ఏడాది అదే నెలలో ₹1.75 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తంగా 10% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ₹9.13 లక్షల కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఆగస్టులో డొమెస్టిక్ రెవెన్యూ 9.2% వృద్ధితో ₹1.25 లక్షల కోట్లు, దిగుమతుల ద్వారా 12.1% వృద్ధితో ₹49,976 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది.

Similar News

News January 28, 2026

మేడారానికి భారీగా వైద్య సిబ్బంది

image

TG: మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున ఏర్పాట్లు చేసింది. మేడారంలో 50 పడకల ఆస్పత్రి, జాతర ప్రాంగణంలో 30 మెడికల్ క్యాంపులు, రూట్లలో 42 క్యాంపులు ఏర్పాటు చేశారు. 544మంది డాక్టర్లు సహా 3,199మంది వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 38 పెద్ద అంబులెన్సులు, ట్రాఫిక్ జామ్ అయితే పేషెంట్ వద్దకే వెళ్లేలా 40 బైక్ అంబులెన్సులను సిద్ధం చేశారు.

News January 28, 2026

‘కారుణ్య నియామకాల్లో మానవత్వమే ప్రధానం’

image

AP: ఉద్యోగి మరణం లేదా అనారోగ్య కారణాలతో పదవీ విరమణ ఆ కుటుంబానికి ఆర్థిక మరణంగా మారకూడదని HC స్పష్టం చేసింది. కారుణ్య నియామకాలను సాంకేతిక కారణాలతో ఏకపక్షంగా తిరస్కరించొద్దని సూచించింది. విజయనగరం జిల్లాకు చెందిన నారాయణమ్మ కేసులో ఐదేళ్ల గడువు పేరుతో ఉద్యోగం నిరాకరించడం తప్పేనని పేర్కొంది. కుటుంబ ఆర్థిక పరిస్థితిని మానవీయ కోణంలో చూడాలని, 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది.

News January 28, 2026

పంటలకు పురుగుల బెడద.. నివారణ ఎలా?

image

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ప్రధాన పంటలకు చీడపీడల బెడద పెరిగింది. మామిడిలో తేనెమంచు పురుగు, వరిలో కాండం తొలిచే పురుగు, మిరపలో తామర పురుగు, మొక్కజొన్నలో కత్తెర పురుగుల ఉద్ధృతి పెరిగింది. జీడిమామిడిలో టీ దోమ, మినుములో కాండం ఈగ సమస్య ఎక్కువైంది. వీటిని సకాలంలో కట్టడి చేయకుంటే ఈ పంటలకు తీవ్ర నష్టం తప్పదు. ఈ పురుగులను ఎలా నివారించాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ క్లిక్<<>> చేయండి.