News April 1, 2025
మార్చిలో GST వసూళ్లు ₹1.96L Cr

జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదైంది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ సారి 9.9% పెరిగి ₹1.96L Cr వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో CGST ₹38,100Cr, SGST ₹49,900Cr, IGST ₹95,900Cr, సెస్సులు ₹12,300Cr వసూలైనట్లు పేర్కొంది. రిఫండ్స్ రూపంలో ₹19,615Cr చెల్లించగా, నికరంగా ₹1.76L Cr వచ్చినట్లు తెలిపింది. FY2025లో మొత్తంగా ₹19.56L Cr వసూలైనట్లు(8.6% వృద్ధి) వివరించింది.
Similar News
News April 6, 2025
సూర్య తిలకం.. PHOTO OF THE DAY

యూపీ అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. ఆలయ గర్భగుడిలో బాల రాముడి విగ్రహం నుదుటిపై ‘సూర్య తిలకం’ వీక్షించి భక్తులు పరవశించిపోయారు. ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది PHOTO OF THE DAY అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రతి శ్రీరామ నవమి రోజున రాముడి నుదుటిపై సూర్య కిరణాలు పడేలా బెంగళూరు IIA, CBRI సైంటిస్టులు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
News April 6, 2025
పశ్చిమ బెంగాల్లో వెల్లివిరిసిన మత సామరస్యం

పశ్చిమ బెంగాల్ సిలిగుడిలో మత సామరస్యం వెల్లివిరిసింది. శ్రీరామ నవమి శోభాయాత్ర చేస్తున్న భక్తులను ముస్లిం యూత్ పూలు చల్లుతూ ఆహ్వానించారు. ర్యాలీలో పాల్గొన్న వారికి వాటర్ బాటిల్స్ అందజేశారు. భక్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపారు. సిలిగుడిలో అన్ని మతాల వారు సోదర భావంతో నివసిస్తారని, మత వివక్ష ఉండదని భక్తులు తెలిపారు.
News April 6, 2025
ఘోరం: భార్య పెట్టే టార్చర్ భరించలేక..

భార్య వేధింపులు తాళలేక మరో భర్త తనువు చాలించాడు. వేగంగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో జరిగింది. రామచంద్ర బర్జెనాకు రెండేళ్ల కింద రూపాలితో వివాహం జరిగింది. వారికి ఓ కుమార్తె సంతానం. పెళ్లి నాటి నుంచి భార్య మానసికంగా వేధిస్తోందంటూ ఓ వీడియో రికార్డ్ చేసి అతను సూసైడ్ చేసుకున్నాడు. రామచంద్ర తల్లి ఫిర్యాదుతో రూపాలిని పోలీసులు అరెస్ట్ చేశారు.