News April 1, 2025

మార్చిలో GST వసూళ్లు ₹1.96L Cr

image

జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదైంది. గతేడాది మార్చితో పోలిస్తే ఈ సారి 9.9% పెరిగి ₹1.96L Cr వచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో CGST ₹38,100Cr, SGST ₹49,900Cr, IGST ₹95,900Cr, సెస్సులు ₹12,300Cr వసూలైనట్లు పేర్కొంది. రిఫండ్స్ రూపంలో ₹19,615Cr చెల్లించగా, నికరంగా ₹1.76L Cr వచ్చినట్లు తెలిపింది. FY2025లో మొత్తంగా ₹19.56L Cr వసూలైనట్లు(8.6% వృద్ధి) వివరించింది.

Similar News

News April 20, 2025

వచ్చే సంక్రాంతికి అఖండ-2?

image

బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో బాలకృష్ణ నటిస్తున్న అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడనున్నట్లు సమాచారం. తొలుత ఈ ఏడాది సెప్టెంబర్ 25కి ప్లాన్ చేయగా ఆలోపు సినిమా షూటింగ్, VFX వర్క్స్ పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. దీంతో వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ యోచిస్తున్నట్లు టాక్. కాగా బాలయ్య- బోయపాటి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయనే వార్తలను సినీ వర్గాలు <<16051406>>ఖండించిన<<>> విషయం తెలిసిందే.

News April 20, 2025

ఇవాళ బీసీ గురుకుల ప్రవేశ పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి

image

TG: 2025-26కు గాను BC గురుకుల స్కూళ్లలో ఖాళీగా ఉన్న 6, 7, 8, 9వ తరగతి సీట్ల భర్తీకి ఇవాళ పరీక్ష జరగనుంది. ఇందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 6,832 బ్యాక్‌లాగ్ సీట్లకు గాను 26,884 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 109 పరీక్ష కేంద్రాల్లో ఉ.10 గంటల నుంచి మ.12గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. విద్యార్థులు తప్పనిసరిగా హాల్‌టికెట్లు తీసుకెళ్లాలి. ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి ఉండదు.

News April 20, 2025

వరల్డ్ కప్ కోసం భారత్ వెళ్లం: పాక్

image

భారత్‌లో జరగనున్న ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో తమ టీమ్ పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ముందే జరిగిన ఒప్పందం ప్రకారం తటస్థ వేదికల్లోనే తాము ఆడతామని PCB ఛైర్మన్ నఖ్వీ తెలిపారు. ‘ఛాంపియన్స్ ట్రోఫీ సమయంలో భారత్ ఎలాగైతే మా దేశానికి రాకుండా న్యూట్రల్ వేదికల్లో ఆడిందో, మేము కూడా అలాగే ఆడతాం. WC ఆతిథ్య దేశమైన భారతే ఆ వేదికలను ఎంపిక చేయాలి’ అని నఖ్వీ అన్నారు.

error: Content is protected !!