News June 2, 2024
మే నెలలో రూ.1.73 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

మే నెలలో జీఎస్టీ వసూళ్లు భారీగా నమోదయ్యాయి. రూ.1.73 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గతేడాదితో పోలిస్తే ఇది 10 శాతం అధికం. మే నెలలో దిగుమతులు క్షీణించినా దేశీయంగా లావాదేవీలు 15.3 శాతం పెరగడం కలిసొచ్చాయి. మొత్తం వసూళ్లలో సీజీఎస్టీ వాటా రూ.32409 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.40,265 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,781 కోట్లు కాగా సెస్సుల రూపంలో రూ.12,284 కోట్లు వచ్చింది.
Similar News
News November 24, 2025
ఇండియాలో చీపెస్ట్ కార్లు ఇవే..

1.మారుతి సుజుకి S-Presso: రూ.3.50 లక్షలు
2.మారుతి సుజుకి Alto K10: రూ.3.70 లక్షలు
3.రెనాల్ట్ క్విడ్: రూ.4.30 లక్షలు
4.టాటా టియాగో: రూ.4.57 లక్షలు
5.మారుతి సుజుకి Celerio: రూ.4.70 లక్షలు
6.Citroen C3: రూ.4.80 లక్షలు
>పై ధరలన్నీ ఎక్స్-షోరూమ్‌వే.
News November 24, 2025
RECORD: ఎకరం రూ.137 కోట్లు

TG: హైదరాబాద్ కోకాపేట్‌లో భూములు రికార్డు ధర పలికాయి. నియోపొలిస్‌లో ప్లాట్ నం.17, 18లకు HMDA ఈ-వేలం నిర్వహించింది. ప్లాట్ నం.18లో ఎకరం భూమి రూ.137 కోట్లు, ప్లాట్ నం.17లో ఎకరం భూమి రూ.136.25 కోట్లు పలికింది. మొత్తం 9.9 ఎకరాలకు గాను HMDA రూ.1,355 కోట్లు దక్కించుకుంది. డిసెంబర్ 9న ప్లాట్ నం.19కు ఈ-వేలం జరగనుండగా ఎకరం రూ.150 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.
News November 24, 2025
‘Gambhir Go Back’.. నెటిజన్ల ఫైర్

గౌతమ్ గంభీర్ కోచ్ అయ్యాక టీమ్ ఇండియా ఆటతీరు దిగజారిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. స్వదేశంలో జరిగే టెస్టుల్లోనూ ఇంత దారుణమైన బ్యాటింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయ్యామని, BGT సిరీస్ కోల్పోయామని గుర్తు చేస్తున్నారు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో పదేపదే మార్పులు ఎందుకని మండిపడుతున్నారు. గంభీర్ హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?


