News December 21, 2024
నేడు GST కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయాలు?

FM నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఇవాళ GST కౌన్సిల్ భేటీ కానుంది. లైఫ్, మెడికల్ ఇన్సూరెన్స్‌లపై GST రేటు తగ్గించడంపై ఈ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్సుంది. జొమాటో, స్విగ్గీపై GST రేటు 5% తగ్గించడంతో పాటు ఈవీలు, పెట్రోల్/డీజిల్‌తో నడిచే చిన్న స్థాయి వాహనాలపై GSTని 12% నుంచి 18%కి పెంచాలని సిఫార్సు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 148 వస్తువులపై GSTని సవరించాలని ప్రతిపాదనలు వచ్చినట్లు సమాచారం.
Similar News
News January 20, 2026
KNR: మున్సిపల్ ఎన్నికలు.. రంగంలోకి మంత్రి తుమ్మల!

కరీంనగర్ జిల్లాలో ఒక కార్పొరేషన్ 3 మున్సిపాలిటీలు ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో 66 డివిజన్లు ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ కోసం కాంగ్రెస్ నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు మక్కువ చూపుతున్నారు. పలువురు టికెట్ల కోసం.. మంత్రులు, వివిధ హోదాలో ఉన్న వారి ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీనికి చెక్కు పెడుతూ కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఇంఛార్జ్‌గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నియమించింది.
News January 20, 2026
ఒక్క రోజే రూ.12,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.12,000 పెరిగి రూ.3,30,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950 ఎగబాకి రూ.1,35,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.
News January 20, 2026
3 నెలల ముందుగానే వచ్చేశాయ్!

TG: సాధారణంగా ఏప్రిల్‌లో మార్కెట్లోకి వచ్చే మామిడిపండ్లు ఈసారి 3 నెలల ముందుగానే వచ్చేశాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ, ఎంజే, గడ్డి అన్నారం తదితర మార్కెట్లలో బంగినపల్లి రకం కేజీ రూ.200 వరకు విక్రయిస్తున్నారు. చప్పగా, పుల్లగా ఉండటంతో మామిడి కొనేందుకు చాలా మంది ఇష్టపడట్లేదని వ్యాపారులు చెబుతున్నారు. హైబ్రిడ్ సాగు విధానాలు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలతో మామిడి ముందుగానే వస్తోందని పేర్కొన్నారు.


