News September 9, 2024

కీలక నిర్ణయాన్ని వాయిదా వేసిన జీఎస్టీ కౌన్సిల్!

image

జీవిత, ఆరోగ్య బీమాపై జీఎస్టీ తగ్గింపు విష‌యంలో కౌన్సిల్ త‌న నిర్ణ‌యాన్ని వాయిదా వేసిన‌ట్టు తెలుస్తోంది. ప్రస్తుతం, పాలసీదారులు తమ ప్రీమియంలపై 18% GST చెల్లిస్తున్నారు. ఈ స‌మావేశంలో పాల‌సీదారుల‌కు ఊర‌ట క‌ల్పిస్తార‌ని అంద‌రూ ఆశించారు. అయితే, కౌన్సిల్ తదుపరి సమావేశంలో దీనిని పున:సమీక్షించాలనే ఆలోచనతో చర్చను వాయిదా వేసిన‌ట్టు తెలిసింది. దీంతో పాల‌సీదారులు మ‌రికొన్ని రోజులు వేచిచూడాల్సిన ప‌రిస్థితి.

Similar News

News December 10, 2025

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో ఉద్యోగాలు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీలో 7 ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిప్లొమా లేదా బీఎస్సీ లేదా ఇంజినీరింగ్ ఉత్తీర్ణులు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://nise.res.in/.

News December 10, 2025

నానో ఎరువులను ఎలా వాడాలి?

image

నానో యూరియా, DAPలను పైరుపై పిచికారీ పద్ధతిలోనే వాడాలి. వీటిని భూమిలో, డ్రిప్‌‌లలో వాడకూడదు. పంటలకు దుక్కిలో వ్యవసాయ నిపుణులు సిఫార్సు చేసిన ఎరువులను యథావిధిగా వేయాలి. పంటకు పైన ఎరువులను సిఫార్సు చేసినప్పుడు మాత్రం.. నానో ఎరువుల రూపంలో పిచికారీ చేసుకోవాలి. నానో యూరియా, DAPలను ఎకరాకు అర లీటరు(లీటరు నీటికి 4ml)చొప్పున పిచికారీ చేయాలి. తర్వాత సంప్రదాయ యూరియా, DAPలను పంటకు వేయనవసరం లేదు.

News December 10, 2025

ఇతిహాసాలు క్విజ్ – 92

image

ఈరోజు ప్రశ్న: గణపతి, కార్తీకేయ సోదరులను ముల్లోకాలు చుట్టిరమ్మనే పరీక్ష శివుడు ఎందుకు పెట్టాడు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>